Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉత్తర కాశ్మీర్‌లో నెట్‌వర్క్ విస్తరణ కోసమే ప్రవేశించా : ఉగ్రవాది సజ్జాద్ అహ్మద్

ఉత్తర కాశ్మీర్‌లో నెట్‌వర్క్ విస్తరణ కోసమే ప్రవేశించా : ఉగ్రవాది సజ్జాద్ అహ్మద్
, శనివారం, 29 ఆగస్టు 2015 (14:29 IST)
నేను పాకిస్థాన్‌కు చెందిన యువకుడినే... లష్కరే తోయిబా సంస్థ ఆదేశం మేరకు ఉత్తర కాశ్మీర్‌లో నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు భారత్‌లో ప్రవేశించినట్టు భారత భద్రతా బలగాలకు సజీవంగా పట్టుబడిన ఉగ్రవాది సజ్జాద్ అహ్మద్ వెల్లడించారు. పైగా, ముంబైలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాది అజ్మల్ కసబ్, ఇటీవల తనకంటే ముందు పట్టుబడిన ఉగ్రవాది నవేద్ అహ్మద్ తనకు తెలుసని చెప్పుకొచ్చాడు. 
 
నవేద్ అహ్మద్ తర్వాత సజ్జాద్ అహ్మద్ సజీవంగా పట్టుబడిన విషయం తెల్సిందే. అతని వద్ద భారత భద్రతా బలగాలు జరిపిన విచారణలో అనేక విషయాలు వెల్లడించాడు. తాను లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వాడినని తెలిపాడు. ఉత్తర కాశ్మీర్‌లో తమ నెట్‌వర్క్‌ను విస్తరింపజేసే పనిని లష్కర్-ఏ-తోయిబా తమకు అప్పజెప్పిందని... ఈ పనిమీదే తాము భారత్‌లో అడుగుపెట్టామని చెప్పాడు. 
 
తాను లష్కర్ తోయిబా సంస్థలో చేరకముందు... పాకిస్థాన్‌లోని ముల్తాన్ ప్రావిన్స్‌లో ఉన్న ముజఫర్‌ఘర్‌లో తన కుటుంబం నివసిస్తోందని సజ్జాద్ తెలిపాడు. లష్కర్ సంస్థలో చేరక ముందు తాను లేబర్‌గా పనిచేస్తుండేవాడినని వెల్లడించాడు. తమ గ్రూపు ఆగస్టు 17-20 తేదీల మధ్యలో భారత్‌లో ప్రవేశించిందని చెప్పాడు. 

Share this Story:

Follow Webdunia telugu