Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఏసుక్రీస్తు... అమెరికా యువతి

అమెరికాకు చెందిన ఓ యువతి సంచలన వ్యాఖ్యలు చేసింది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఏసుక్రీస్తే తన తండ్రి అని ప్రకటించింది. తానిప్పుడు 8 నెలల గర్భవతినని, అతి త్వరలో తాను ఏసుక్రీస్తు బిడ్డకు జన్మనివ్వబోతు

నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఏసుక్రీస్తు... అమెరికా యువతి
, ఆదివారం, 6 నవంబరు 2016 (14:51 IST)
అమెరికాకు చెందిన ఓ యువతి సంచలన వ్యాఖ్యలు చేసింది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఏసుక్రీస్తే తన తండ్రి అని ప్రకటించింది. తానిప్పుడు 8 నెలల గర్భవతినని, అతి త్వరలో తాను ఏసుక్రీస్తు బిడ్డకు జన్మనివ్వబోతున్నానని హేలీ అనే అమ్మాయి ఒక టీవీ షోలో ప్రకటించింది. 
 
ఇక్కడ విచిత్రమేమిటంటే... 19 ఏళ్ల ఈ యువతకి అసలు పెళ్లే కాలేదు. పైగా వైద్యులు ఆమెకు మూడుసార్లు అన్ని పరీక్షలూ చేసి ఆమె గర్భవతి కానే కాదని తేల్చారు. అయినా ఆమె వినిపించుకోవడం లేదు. ‘‘డాక్టర్లు ఏమైనా చెప్పనివ్వండి. ఎవరైనా నన్ను చూసి నవ్వుకోనివ్వండి. గత కొద్ది వారాల్లో నా బరువు 11 కిలోలు పెరిగింది. రేపు నేను జీసస్‌ బిడ్డకు జన్మనిచ్చాక అందరూ నిజాన్ని ఒప్పుకోక తప్పదు’’ అని ఆమె ఘంటాపథంగా చెబుతోంది. 
 
కానీ ఆమె తల్లి క్రిస్టీ మాత్రం కుమార్తె మాటలను కొట్టిపారేసింది. గతంలో తాను అమెరికన్‌ ఐడల్‌ కార్యక్రమంలో పాల్గొన్నట్టు హేలీ కట్టు కథలు అల్లిందని క్రిస్టీ వెల్లడించింది. ‘‘హేలీ, ఆమె సోదరి చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురయ్యారు. అప్పటినుంచీ వారు మానసికంగా దెబ్బతిన్నారు. హేలీ సోదరి మానసిక వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స పొందింది. కానీ హేలీ మాత్రం వెళ్లలేదు. ఆమె ఏవేవో భ్రాంతులకు గురవుతూ అవి నిజమని భావిస్తుంటుంది’’ అని చెప్పుకొచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యువతిని కుక్కలా కట్టేసి.. కళ్ల ముందే ఆమె ప్రియుడిని చంపేశాడు...