Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేపాల్ కోలుకోవాలంటే.. 5 బిలియన్ డాలర్లు కావాలట!: అంచనా

నేపాల్ కోలుకోవాలంటే.. 5 బిలియన్ డాలర్లు కావాలట!: అంచనా
, సోమవారం, 27 ఏప్రియల్ 2015 (19:04 IST)
నేపాల్‌కు కావలసిన ఆర్థిక సాయంపై అమెరికాలోని కొలరాడోకు చెందిన ఏషియా పసిఫిక్ చీఫ్ ఎకానమిస్ట్ రాజీవ్ బిశ్వాస్ అంచనావేశారు. ప్రకృతి బీభత్సానికి అతలాకుతలమైన నేపాల్ తిరిగి కోలుకోవాలంటే దాదాపు 5 బిలియన్ డాలర్లరకు పైగా అవసరమని రాజీవ్ బిశ్వాస్ అన్నారు. నేపాల్ ఏడాది జీడీపీ కేవలం వెయ్యి డాలర్లని, ఎక్కువ మంది నేపాలీయులు పేదలని రాజీవ్ బిశ్వాస్ చెప్పారు. 
 
ఇంత పెద్ద సహాయం కావాలంటే అంతర్జాతీయ ఫైనాన్స్, టెక్నికల్ సంస్థల సహాయం సుదీర్ఘకాలం అవసరమని బిశ్వాస్ అభిప్రాయపడ్డారు. నేపాల్ పునరుద్ధరణకు, సహాయ కార్యక్రమాలకు నేపాల్ వద్ద ప్రస్తుతం తక్కువ ఆర్థిక వనరులున్నాయని ఆయన పేర్కొన్నారు. వాటితో నేపాల్ పునర్నిర్మాణం సాధ్యం కాదని, భవనాలు గట్టిగా ఉండేలా, స్థిరమైన ప్రమాణాలతో ఉండేలా నిర్మించేందుకు దాదాపు 5 బిలియన్ల డాలర్లు ఉండాలని బిశ్వాస్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu