Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒకనాటి బ్రిటీష్ రాక్ సింగ్.. నేడు ఐఎస్ఐఎస్ మిలిటెంట్!

ఒకనాటి బ్రిటీష్ రాక్ సింగ్.. నేడు ఐఎస్ఐఎస్ మిలిటెంట్!
, సోమవారం, 1 సెప్టెంబరు 2014 (12:27 IST)
ఒకనాడు బ్రిటీషన్ రాక్ సింగర్‌గా చెరగని ముద్ర వేయించుకున్న శాలీ జోన్స్.. ఇపుడు కరుడుగట్టిన తీవ్రవాదిగా మారిపోయారు. సింగర్‌గా ఉన్న సమయంలోనే ఇద్దరు పిల్లకు తల్లి అయిన ఆమె... ఇపుడు ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థలో చేరి కీలక సభ్యురాలిగా విధులు నిర్వహిస్తోంది. 
 
అంతేగాకుండా, తలలు తీస్తామంటూ సిరియా నుంచి క్రైస్తవులకు హెచ్చరికలు జారీచేస్తోంది. ప్రస్తుతం ఆమె పేరు ఉమ్మ్ హుస్సేన్ బ్రిటానీగా పేరు మార్చుకున్నట్టు సమాచారం. కెంట్‌లోని చాథమ్ ఆమె స్వస్థలం అని భద్రత సంస్థలు అంటున్నాయి. ఉమ్మ్ తొలుత జునైద్ హుస్సేన్ అనే ఓ బ్రిటీష్ జిహాదీని పెళ్ళాడింది. అంతకుముందు అతగాడు కంప్యూటర్ హ్యాకింగ్‌కు పాల్పడేవాడు. 
 
ఆన్‌లైన్‌లో సాగిన వీరి రొమాన్స్ పెళ్ళికి దారితీసింది. అనంతరం వీరు మిలిటెంట్ గ్రూపుల్లో చేరేందుకు వేర్వేరుగా సిరియాకు చేరుకున్నారు. కాగా, జునైద్ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్ తాజా రూపం) గ్రూపులో చేరగా, అమెరికా జర్నలిస్టు ఫోలీ ఘటనలో ఇప్పుడతని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఫోలీ గొంతు కోసింది ఇతడేనన్న వార్తలు కూడా వస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu