Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జోరందుకున్న క్రిస్మస్.. బ్రెడ్ హోటల్ నిర్మించిన రిట్జ్-కార్లటన్.. 400 పౌండ్ల తేనె, 250 కోడిగుడ్లతో?

క్రిస్మస్ వచ్చేస్తోంది. కేకుల తయారీ జోరందుకుంది. అలాంటి రెస్టారెంట్లు కూడా క్రిస్మస్‌ను పురస్కరించుకుని వెరైటీ వంటకాలను సిద్ధం చేస్తున్నాయి. అయితే క్రిస్మస్‌‌ను పురస్కరించుకుని ఓ హోటల్ బ్రెడ్‌తోనే తయా

జోరందుకున్న క్రిస్మస్.. బ్రెడ్ హోటల్ నిర్మించిన రిట్జ్-కార్లటన్.. 400 పౌండ్ల తేనె, 250 కోడిగుడ్లతో?
, ఆదివారం, 27 నవంబరు 2016 (14:17 IST)
క్రిస్మస్ వచ్చేస్తోంది. కేకుల తయారీ జోరందుకుంది. అలాంటి రెస్టారెంట్లు కూడా క్రిస్మస్‌ను పురస్కరించుకుని వెరైటీ వంటకాలను సిద్ధం చేస్తున్నాయి. అయితే క్రిస్మస్‌‌ను పురస్కరించుకుని ఓ హోటల్ బ్రెడ్‌తోనే తయారైంది. నిజమేనా? అని షాకవుతున్నారు కదూ.. అయితే చదవండి. రిట్జ్‌-కార్లటన్‌ అనే సంస్థ అమెరికాలోని అరిజోనాలో డొవ్‌ మౌంటెయిన్‌ ప్రాంతంలో జింజర్‌ బ్రెడ్‌ హౌస్‌(హోటల్‌)ను నిర్మించింది. 
 
ఈ సంస్థ గతంలో కూడా ఇలాంటి బ్రెడ్‌ హౌస్‌లు నిర్మించి పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించింది. తాజాగా నిర్మించిన ఈ బ్రెడ్ బోటల్‌లో ఆరుగురు కూర్చునేందుకు వీలుగా డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేషారు. ఈ బ్రెడ్‌ హోటల్‌ నిర్మాణం కోసం 400పౌండ్ల తేనె, 865 పౌండ్ల చెక్కర, 350పౌండ్ల గోధుమ పిండి ఉపయోగించారు. 
 
అంతేగాకుండా వంద పౌండ్ల అల్లంపొడి, 250 కోడిగుడ్లు ఉపయోగించారు. క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేకంగా వేడుకలు జరుపుకోవడం కోసం అతిథులు ఈ హోటల్‌ను అద్దెకు తీసుకోవచ్చు. లంచ్‌ లేదా డిన్నర్‌ చేసేందుకు రూ.200 డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది. భోజన రుసుములు వేరుగా చెల్లించాలి. అయితే ఈ హోటల్ డిసెంబర్ 30వరకే అందుబాటులో ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముద్రగడ పోరాటమంటే నాకు ఎంతో ఇష్టం.. మోహన్ బాబు కితాబు