Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కిర్గిజ్‌స్థాన్ యువతి పొట్టలో 4 కేజీల వెంట్రుకలు!

కిర్గిజ్‌స్థాన్ యువతి పొట్టలో 4 కేజీల వెంట్రుకలు!
, మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (16:13 IST)
సాధారణంగా ఎవరైనా చాక్లెట్లు తింటారు, బిస్కట్లు, స్వీట్లు వంటివి ఆరగిస్తుంటారు. కానీ, ఆ అమ్మాయి ఏకంగా జుట్టే తినేసింది. అలా ఏకంగా నాలుగు కేజీలు వెంట్రుకలను తన పొట్టలో భద్రపరిచింది. వెంట్రుకలు పొట్టలో చేరేకొద్దీ భరించలేని కడుపునొప్పి రావడంతో కిర్గిజ్‌స్థాన్లోని వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స చేసి వెంట్రుకల ఉండను తొలగించారు. 
 
18 ఏళ్ల వయసున్న ఆ అమ్మాయికి తన జుట్టు కొనలు తినడంతో పాటు ఇంట్లోని తివాచీకి ఉన్న ఊలు తినడం కూడా అలవాటేనట. ఆమె పేరు ఐపెరి అలెక్సీవా. ఆమె కిర్గిజిస్థాన్లోని బాట్కెన్ రాష్ట్రానికి చెందినది. చివరకు మంచినీళ్లు కూడా తాగలేనంత స్థాయికి ఆరోగ్యం దిగజారిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. 
 
ఆమె జీర్ణ వ్యవస్థలో పెద్ద ఉండ పేరుకుపోయినట్లు వైద్యులు గుర్తించారు. అత్యవసరంగా ఆపరేషన్ చేశారు. ఆమె పొట్ట బాగా వాచిపోయిందని, చివరకు లోపల నుంచి మొత్తం జుట్టు, ఊలు బయటకు తీశామని వైద్యులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu