Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఓ శాండ్‌విచ్ కోసం శరీరాన్ని అమ్ముకుంటున్న అమ్మాయిలు.. ఎక్కడ?

ఓ శాండ్‌విచ్ కోసం శరీరాన్ని అమ్ముకుంటున్న అమ్మాయిలు.. ఎక్కడ?
, సోమవారం, 30 నవంబరు 2015 (09:25 IST)
సాధారణంగా అనేక మంది పేద మహిళలు పొట్టకూటి కోసం పడుపు వృత్తి చేస్తుంటారు. మరికొంతమంది అమ్మాయిలు జల్సాలు చేసేందుకు అవసరమైన డబ్బు కోసం వ్యభిచారం చేస్తుంటారు. అయితే, ఆ దేశ అమ్మాయిలు, మహిళలు మాత్రం ఒక్కపూట కడుపు నింపుకునేందుకు పురుషులకు పడక సుఖం అందిస్తున్నారు. అదీ కూడా ఒకే ఒక్క శాండ్‌‌విచ్ కోసం. ఇలాంటి దారుణ పరిస్థితిని గ్రీస్ మహిళలు ఎదుర్కొంటున్నారు. 
 
గ్రీస్ దేశాన్ని ఆర్థిక సంక్షోభం తీరని కష్టాల్లోకి నెట్టిన విషయంతెల్సిందే. ఈ సంక్షోభం కేవలం ఆ దేశాన్ని మాత్రమే కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సైతం ఓ కుదుపు కుదిపింది. ఫలితంగా గ్రీస్ దేశానికి తీరని కష్టాలను మిగిల్చింది. చాలా మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే.. కొందరు యువతులు ఆకలి బాధలను తాళలేక ఓ శాండ్‌విచ్ కోసం తమ శరీరాన్ని అమ్ముకుంటున్న వైనం వారి దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. 
 
తాజాగా గ్రీక్‌ దేశంలో 17 వేల మందికిపైగా సెక్స్ వర్కర్లు ఉన్నట్టు ఓ సర్వేలో వెల్లడైన నిజం. తూర్పు యూరప్‌లో వ్యభిచార వృత్తిలో గ్రీక్ మహిళలే ఎక్కువ మంది ఉన్నట్టు ఈ సర్వే వెల్లడించింది. గ్రీక్‌లో ఆర్థిక సంక్షోభం రాకముందు సెక్స్ వర్కర్లు దాదాపు రూ.4000 వేల వరకు డిమాండ్ చేసేవారు. కాగా ఇప్పుడు 150 రూపాయలు ఇస్తే చాలన్నట్టుగా పరిస్థితి మారింది. 17-20 ఏళ్ల వయస్సులో ఈ వృత్తిలోకి వస్తున్నట్టు సర్వేలో తేలిన నిజం.

Share this Story:

Follow Webdunia telugu