Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫ్రాన్స్ పోలీసుల ఓవరాక్షన్.. బీచ్‌లో మహిళను బురఖా విప్పమన్నారు.. సోషల్ మీడియాలో రచ్చ

ఫ్రాన్స్ పోలీసులు ఓవరాక్షన్ చేశారు. బీచ్‌లో బురఖాలు ధరించి కూర్చున్న మహిళలను పోలీసులు బలవంతంగా బట్టలూడదీయించి తనిఖీలు చేశారు. ఆ సమయంలో ఆడ పోలీసులు కూడా లేకపోవడంతో ఈ చర్య వివాదాస్పదమైంది.

ఫ్రాన్స్ పోలీసుల ఓవరాక్షన్.. బీచ్‌లో మహిళను బురఖా విప్పమన్నారు.. సోషల్ మీడియాలో రచ్చ
, శుక్రవారం, 26 ఆగస్టు 2016 (14:49 IST)
ఫ్రాన్స్ పోలీసులు ఓవరాక్షన్ చేశారు. బీచ్‌లో బురఖాలు ధరించి కూర్చున్న మహిళలను పోలీసులు బలవంతంగా బట్టలూడదీయించి తనిఖీలు చేశారు. ఆ సమయంలో ఆడ పోలీసులు కూడా లేకపోవడంతో ఈ చర్య వివాదాస్పదమైంది. వివరాల్లోకి వెళితే.. గత నెలలో ఉగ్రవాదులు విరుచుకుపడిన నీస్ పట్టణంలో పోలీసులు భద్రతను పెంచారు. తనిఖీలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా నీస్ పట్టణంలోని సముద్ర తీరంలో మధ్య వయస్కురాలైన ఓ ముస్లిం మహిళ బురఖా ధరించి కూర్చుని ఉండగా.. ఆమెను బట్టలూడదీయమన్నారు.
 
ఆపై పోలీసులు, ఆయుధాలు, పెప్పర్ స్పేలతో ఆమెను సమీపించిన పోలీసులు బలవంతంగా ఆమె బట్టలు ఊడదీయించి తనిఖీలు చేశారు. ఆ సమయంలో ఆడ పోలీసులు కూడా లేరు. ఆమె కూడా పోలీసులు చెప్పారనే భయంతో బురఖా తొలగించింది. ప్రస్తుతం ఫ్రాన్స్ పోలీసులు చేసిన ఓవరాక్షన్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.
 
బాధితురాలికి బాసటగా నిలిచేలా 'బుర్కినీగేట్' పేరిట ఓ హ్యాష్ ట్యాగ్ మొదలై వైరల్ అవుతోంది. ఈ ఘటన 23వ తేదీన జరిగింది. ఇక పోలీసులు తమ దేశంలో బురఖాలపై నిషేధం ఉందని తాము చేసిన తప్పును కప్పిపుచ్చుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్బీఐ మాజీ గవర్నర్‌కు ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ కూడా లేదు : సుబ్రమణ్య స్వామి