Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాళ్లు అందరిముందే సెక్స్ చేసుకున్నారు... బామ్మ వీడియో తీసింది...

వాళ్లు అందరిముందే సెక్స్ చేసుకున్నారు... బామ్మ వీడియో తీసింది...
, శనివారం, 26 జులై 2014 (16:27 IST)
కామాతురాణం నభయం నలజ్జ అంటే ఏమిటీ నాన్సెన్స్ అని తీసిపారేసుండొచ్చు ఫ్లోరిడా వాసులు. కానీ, వాస్తవం బోధపడేసరికి అర్థమై వుంటుంది గీతోపదేశం చేసిన కృష్ణుడెంత గొప్పొడో. పట్టపగలు మిట్టమధ్యాహ్నం సముద్రం తీరాన సెక్స్ చేస్తూ పోలీసులకు దొరికిపోయిందో జంట. ఎప్పుడూ సముద్ర ప్రేమికులతో కళకళలాడే బ్రెడెంటన్ బీచ్‌లో ఆదివారం మధ్యాహ్న సమయంలో ఫ్లోరిడాకు చెందిన బెన్నీ కాబల్లెరో, ఎలీసా అల్వారెజ్ జంట అందరూ చూస్తుండగానే శృంగారంలో పాల్గొన్నారు.
 
వారు శృంగారం చేసుకునే సమయంలో పక్కనే వున్న పిల్లల్ని కూడా వాళ్లిద్దరూ పట్టించుకోలేదు. దీన్నంతటినీ గమనించిన ఓ బామ్మగారు ప్రశాంతంగా వీడియో రికార్డింగ్ చేసి పారేసింది. ఆనక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ రికార్డింగ్ టేపు ఆధారంగా ఆ జంటను అరెస్టు చేశారు. ఇక పోలీసు ఫిర్యాదు ఇచ్చిన బామ్మగారు మాత్రం జరిగిన సంఘటన పట్ల తీవ్ర కలత చెందారట.
 
సుమారు ముప్పై ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో నివసిస్తున్నాను. ఇటువంటి సంఘటన ఇంతవరకూ నేనెప్పుడూ చూడలేదంటోంది బామ్మగారు. వాస్తవానికి ఎలీసా జంట సముద్రంలో బాగా లోతు వరకూ వెళ్లి ఆడుకుని తర్వాత ఒడ్డుకు చేరుకున్నారట. నాలుగు గంటలపాటు కదలకుండా అలానే వుండేసరికి వాళ్లు చనిపోయారని భావించారట చాలామంది. ఆ తర్వాత పూనకం వచ్చినవారిలో ఇద్దరూ లేచి విచ్చలవిడిగా సెక్సులో పాల్గొన్నారట.

Share this Story:

Follow Webdunia telugu