Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెల్జియంలో బీర్ కోసం పైప్ లైన్ వేశారు.. మూడు కిలో మీటర్ల పొడవునా..

సాధారణంగా వీధుల్లో నీళ్ల కోసం, కరెంటు, టెలిఫోన్ కనెక్షన్‌ల కోసం పైపులైన్లను వేసుకోవడం మనకు తెలిసిందే. కానీ బెల్జియం దేశంలో ఏకంగా బీర్ కోసం ఓ పైపు లైన్ వేశారు. బ్రగెస్ నగరంలో మూడు కిలోమీటర్ల పొడవునా బీ

బెల్జియంలో బీర్ కోసం పైప్ లైన్ వేశారు.. మూడు కిలో మీటర్ల పొడవునా..
, మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (15:23 IST)
సాధారణంగా వీధుల్లో నీళ్ల కోసం, కరెంటు, టెలిఫోన్ కనెక్షన్‌ల కోసం పైపులైన్లను వేసుకోవడం మనకు తెలిసిందే. కానీ బెల్జియం దేశంలో ఏకంగా బీర్ కోసం ఓ పైపు లైన్ వేశారు. బ్రగెస్ నగరంలో మూడు కిలోమీటర్ల పొడవునా బీర్ పైప్‌లైన్ నిర్మిస్తున్నారు. బాటిలింగ్ ఫ్యాక్టరీకి బీర్‌ను తరలించడం కోసం ఈ పైప్ లైన్ వేస్తున్నారు. సిటీ మధ్యలో ఉన్న బ్రూవరీ నుంచి అండర్ గ్రౌండ్ ద్వారా బాటిలింగ్ ఫ్యాక్టరీకి బీర్‌ను తరలించడం కోసం ఈ పైప్ లైన్ వేస్తున్నారు. 
 
అంతేకాదు బ్రూవరీ నుంచి అండర్ గ్రౌండ్ తవ్వకాలు జరుపుతుండగా తమ ఇళ్లకు బీర్ పైప్ లైన్ ఇవ్వాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారట. కానీ అందుకు వారు ఒప్పుకోలేదు. కాగా ఈ పైప్‌లైన్‌ను అమర్చేందుకు ఎలాంటి డ్యామేజీ కాకుండా స్టీల్ కంటే దృఢంగా ఉండే పాలిథిలిన్ ట్యూబ్‌లను వారు వాడుతున్నారట. రోజుకు 1500 గ్యాలన్ల బీరును ఈ పైప్ లైన్ గుండా తరలించి అక్కడ బాటిళ్లలో నింపుతారు. 
 
బీర్ పైప్ లైన్ వేయడానికి సుమారు 30 కోట్లు(4 మిలియన్ యూరోస్) ఖ‌ర్చు వ‌స్తోంద‌ని క్లౌడ్ ప‌ద్ధ‌తిలో పెట్టుబ‌డులు ఆహ్వానించింది ఆ కంపెనీ. దీంతో కొందరు బీర్ ఔత్సాహికులు త‌మ‌ డబ్బును ఆ కంపెనీలో పెట్టుబడిగా పెట్టారు. పెట్టుబడికి ప్ర‌తిఫ‌లంగా వారందరికీ వాళ్ల‌కు జీవితకాలం రోజుకో బీర్ బాటిల్‌ను ఉచితంగా అందించనున్నారు. ఇప్పటికే ఈ తరహా బీర్ పైప్ లైన్లు జర్మనీ, అమెరికాల్లో ఉండగా, ఇప్పుడు బెల్జియంలో వచ్చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీహార్‌లో 25 అడుగుల లోతు గల చెరువులో పడిన బస్సు: 35 మంది మృతి