Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫేస్ బుక్ సారీ చెప్పింది.. నగ్నంగా ఉన్న రోమన్ గాడ్ విగ్రహాన్ని పోస్ట్ చేసుకోమంది..

ఫేస్ బుక్ సారీ చెప్పింది. నగ్నంగా, చేతిలో త్రిశూలంతో ఉన్న రోమన్ దేవుడు నెఫ్ట్యూన్ విగ్రహాన్ని పోస్ట్ చేసుకోమంది. అయితే ప్రమాణాలకు విరుద్ధంగా, అశ్లీలంగా ఈ చిత్రం ఉందంటూ సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్

ఫేస్ బుక్ సారీ చెప్పింది.. నగ్నంగా ఉన్న రోమన్ గాడ్ విగ్రహాన్ని పోస్ట్ చేసుకోమంది..
, బుధవారం, 4 జనవరి 2017 (11:29 IST)
ఫేస్ బుక్ సారీ చెప్పింది. నగ్నంగా, చేతిలో త్రిశూలంతో ఉన్న రోమన్ దేవుడు నెఫ్ట్యూన్ విగ్రహాన్ని పోస్ట్ చేసుకోమంది. అయితే ప్రమాణాలకు విరుద్ధంగా, అశ్లీలంగా ఈ చిత్రం ఉందంటూ సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌ తొలుత అడ్డుకుంది. అయితే ఆపై సీన్ మారిపోయింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఇటలీలోని బొలొగ్నో నగర విశేషాలను పంచుకునేందుకుగాను చరిత్ర అధ్యయనకర్త అయిన ఎలిసా బర్బారీ ఫేస్‌బుక్‌లో ఓ పేజీని ఏర్పాటుచేశారు. బొలొగ్నోలోని 16వ శతాబ్దం నాటి నెప్ట్యూన్‌ విగ్రహ చిత్రాన్ని ఆమె సదరు పేజీలో పోస్ట్‌ చేశారు. 
 
ఆ చిత్రంలో నెప్ట్యూన్‌ నగ్నంగా, చేతిలో త్రిశూలం పట్టుకొని ఉంటారు. అయితే ఈ ఫోటో ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని పేజీ నుంచి తొలుత తొలగించాల్సిందిగా ఫేస్ బుక్ కోరింది. దీంతో ఫేస్‌బుక్‌ వైఖరిపై ఎలిసా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం నెప్ట్యూన్‌ చిత్రాన్ని అడ్డుకోవడం తమ సెన్సార్‌ తప్పిదమని క్షమాపణలు తెలుపుతూ.. నిరభ్యంతరంగా సదరు చిత్రాన్ని వినియోగించుకోవచ్చని ఫేస్‌బుక్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మ మరణం.. తమిళ రాజకీయాల్లో మార్పులు.. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా స్టాలిన్