సాధారణంగా అబ్బాయిలు.. అమ్మాయిలను వివాహం చేసుకుంటారు. ఇది అందరికి తెలిసిన విషయం. పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరక్కపోతే అందమైన అమ్మాయి ఉంటే చూసిపెట్టండని తెలిసినవారికో, బంధువులకో, లేదంటే మ్యారేజ్ బ్యూరోలకు చెబితే వెతికిపెడతారు. కానీ పెరూకు చెందిన ఒక యువకుడుకి అమ్మాయి దొరకలేదేమోగానీ.. ఏకంగా ఓ చెట్టును వివాహం చేసుకున్నాడు. అది కూడా అంగరంగ వైభవంగా సంప్రదాయబద్దంగా వివాహం చేసుకున్నాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నటుడు రిచార్డ్ చోర్రెస్ పర్యావరణవేత్తగా ఉన్నాడు. 2 వేల ఏళ్లు వయసు ఉన్న ఒక చెట్టును పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. వివాహానికి అందరి ప్రముఖులకు ఆహ్వానం పలికి బంధువుల సమక్షంలో ప్రపంచంలోనే అత్యధిక వయసు ఉన్న వృక్షానికి ఉంగరం తొడిగాడు. మేళతాళాలతో అందరూ చూస్తుండగా ఆ చెట్టును ముద్దాడి వివాహం చేసుకున్నాడు.
ప్రపంచవ్యాప్తంగా అడవుల నరికివేతను అరికట్టే లక్ష్యంతో పెరూ, అర్జెంటీనా, కొలంబియా దేశాల్లో అవాగాహన కార్యక్రమాలు చేపట్టాడు. ఎప్పటికప్పుడు అడవుల విధ్వంసం పెరిగిపోతుందని, ఇప్పటికైనా ప్రపంచ దేశాలు ప్రకృతి పరిరక్షణ చర్యలు చేపట్టాలని రిచార్డ్ చోర్రెస్ పిలుపునిచ్చారు. మొత్తానికి చెట్టుని జీవిత భాగస్వామిగా చేసుకున్నానని ఈ హీరో చాలా ఆనందంగా ఉన్నాడు.