Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విమానాన్ని ఆపేసిన ఎలుక... ఎలుకకు అంతటి పవరెక్కడిది...?

విమానాన్ని ఆపేసిన ఎలుక... ఎలుకకు అంతటి పవరెక్కడిది...?
, మంగళవారం, 23 జూన్ 2015 (18:44 IST)
విమానాలకు పట్టిన గ్రహణం వీడినట్టు లేదు. గత ఏడాది కాలంగా విమాన ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్నాయి. అయితే ఇటీవల విమాన ప్రమాదాలు కాస్త తగ్గినట్టు అనిపించినా, విమానాల్లో సాంకేతిక లోపాలు, తద్వారా విమాన ప్రయాణంలో ఆలస్యం చోటుచేసుకోవడం లేదా విమానాలు రద్దు కావడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి.
 
తాజాగా దుబాయ్‌కు వెళ్లాల్సిన ఒక విమానాన్ని రద్దుచేశారు. దీనికి కారణం సాంకేతిక లోపం కాదు. ఆ విమానంలో ఒక ఎలుక చేసిన రగడే. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. బర్మింగ్‌హామ్ నుంచి దుబాయ్‌‌కి ఒక ఎయిర్‌లైన్స్ విమానం బయలుదేరేందుకు సిద్ధమైంది. ప్రయాణీకులు అంతా విమానంలోకి ఎక్కారు. ఆ సమయంలో విమానంలో ఒక ఎలుక కనిపించింది. 
 
దీంతో విమాన సిబ్బంది దాన్ని పట్టుకునేందుకు పలు రకాల ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ప్రయాణీకులు సైతం ఆ ఎలుక తమను ఎక్కడ కరుస్తుందోనని భయపడుతూ కూర్చున్నారు. చివరికి చేసేది లేక ఈ విమానాన్ని ఒకరోజు మొత్తం రద్దుచేశారు. దీంతో ప్రయాణికులందరినీ దింపేసి, వాళ్లకు రాత్రి అక్కడే ఓ హోటల్లో బస ఏర్పాటుచేశారు. ఎలుక హంగామా కారణంగా విమానం రద్దు చేసినట్టు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ సంస్థ తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu