Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సన్నబడితేనే విధుల్లోకి... బొద్దుగా ఉన్నారని సస్పెన్షన్.. యాంకర్లకు దిమ్మదిరిగింది..!

టీవీలో కనిపించాలంటే.. యాంకర్లు స్లిమ్‌గా ఉండేందుకు.. అందంగా ఉండేందుకు ఎక్కువ శ్రద్ధ చూపుతారు. అయితే ఈజిప్టులో మాత్రం ఓ ఛానల్ 8మంది మహిళా ఉద్యోగుల్ని పని నుంచి తొలగించింది. ఇందుకు బొద్దుగా ఉండటమే కారణమ

సన్నబడితేనే విధుల్లోకి... బొద్దుగా ఉన్నారని సస్పెన్షన్.. యాంకర్లకు దిమ్మదిరిగింది..!
, గురువారం, 18 ఆగస్టు 2016 (13:25 IST)
టీవీలో కనిపించాలంటే.. యాంకర్లు స్లిమ్‌గా ఉండేందుకు.. అందంగా ఉండేందుకు ఎక్కువ శ్రద్ధ చూపుతారు. అయితే ఈజిప్టులో మాత్రం ఓ ఛానల్ 8మంది మహిళా ఉద్యోగుల్ని పని నుంచి తొలగించింది. ఇందుకు బొద్దుగా ఉండటమే కారణమని తెలిసింది. నెలరోజుల్లో సన్నబడి నాజూగ్గా తయారైతేనే ఉద్యోగం ఉంటుందని తేల్చి చెప్పింది. విషయం తెలిసిన మహిళా సంఘాలు ఈజిప్షియన్ రేడియో అండ్ టెలివిజన్ యూనియన్ (ఈఆర్టీయూ) తీరుపై ఫైర్ అవుతున్నాయి. 
 
ఇకపోతే.. సస్పెన్షన్‌కు గురైన యాంకర్లు మండిపడుతున్నారు. నిజంగా తాను లావుగా ఉన్నానో లేదో అనే విషయాన్ని ప్రజలను అడిగి తెలుసుకోవాలని.. అయినా తనను ప్రజలు బాగానే ఆదరిస్తున్నారని ఓ యాంకర్ పేర్కొంది. ఇదంతా కావాలనే కక్షతో చేసిన పని అని ఇంకో యాంకర్ ఆవేదన వ్యక్తం చేసింది. 
 
టీవీ యాజమాన్యం చర్యతో తన కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపంలో కూరుకుపోయారని మరో యాంకర్ తెలిపింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఈ విషయంలో ఏమాత్రం తగ్గేది లేదని చానెల్ చెప్తోంది. సన్నబడితేనే విధుల్లోకి తీసుకుంటామని అంటోంది. మరోవైపు ఈ ఘటనపై పార్లమెంటులోనూ వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను పోనుగాక పోను.... తిరుమల కొండపై తిష్టవేసిన తితిదే జెఈఓ శ్రీనివాసరాజు