Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జిహాదీ ఫైటర్‌తో కూతురి పెళ్లి: రక్షించి వెనక్కి తెచ్చుకున్న నెదర్లాండ్స్ తల్లి!

జిహాదీ ఫైటర్‌తో కూతురి పెళ్లి: రక్షించి వెనక్కి తెచ్చుకున్న నెదర్లాండ్స్ తల్లి!
, శుక్రవారం, 21 నవంబరు 2014 (15:31 IST)
ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన ఓ జిహాది ఫైటర్‌ను పెళ్లి చేసుకోవాలని సిరియాకు వెళ్ళిన నెదర్లాండ్స్ యువతి ఆమె తల్లి ఎంతో సాహసంతో రక్షించి వెనక్కి తెచ్చుకుంది. 
 
స్టర్లినా (19) ఐఎస్ ఫైటర్‌తో నెట్ ద్వారా పరిచయం పెంచుకుని తన పేరును ఐచాగా మార్చుకొని 9 నెలల క్రితం సిరియాకు వెళ్ళింది. పరిచయం చేసుకున్నది గతంలో నెదర్లాండ్స్ సైనికుడిగా ఉంటూ ఆ తరువాత జిహాదీ ఫైటర్‌గా మారిన వ్యక్తితో అయితే, సిరియా వెళ్ళాక ఆమె తప్పనిసరి పరిస్థితిలో ట్యునీషియాకు చెందిన ఫైటర్‌ని వివాహం చేసుకుంది. 
 
ఈ విషయాన్ని తల్లి మోనిక్‌కు చెప్పి సహాయం చేయాలని కోరగా, ఆమె ధైర్యంగా నికాబ్ (బురఖా వంటిది) ధరించి సరిహద్దు దాటి సిరియాకు వెళ్ళి, మిలిటెంట్ల ప్రాబల్యం అధికంగా ఉన్న రఖా నగరానికి చేరుకొని తన కూతురిని అంతే ధైర్యంగా తిరిగి నెదర్లాండ్స్‌కు చేర్చింది. 
 
దేశంలోకి రాగానే ఆమెపై దేశద్రోహం తదితర కేసులు పెట్టి పోలీసులు అదుపులోకి తీసుకున్నా.. మోనిక్ మాత్రం తన కూతురు అమాయకురాలని, కోర్టు కేసుల నుంచి త్వరలో ఆమె రిలీవ్ అవుతుందని నమ్మకంతో ఉంది.

Share this Story:

Follow Webdunia telugu