Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాల్పుల విరమణపై ట్రంప్ కామెంట్స్ ... ప్రపంచ శాంతికి ఇది గొప్ప రోజు

Advertiesment
Donald Trump
అమెరికా, ఇరాన్ దేశాలు రెండు వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకరిచడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోమారు స్పందించారు. ప్రపంచ శాంతికి ఇది రోజని వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాలో ఇది సువర్ణాధ్యాయం కాబోతోందని పేర్కొన్నారు. ఇరాన్‌కు ఇక చాలు అనిపించిందని యుద్ధాన్ని ఉద్దేశించి అన్నారు. అలాగే, ఇరాన్ రాజధాని టెహ్రాన్ పునర్నిర్మాణాన్ని ప్రారంభించుకోవచ్చని సూచించారు. 
 
ప్రపంచ దేశాలు ఆగిపోవాలని కోరుకున్నామని ట్రంప్ పేర్కొన్నారు. హర్మోజ్ జలసంధిని పునరుద్ధరించేందుకు అమెరికా సహాయం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ జలసంధి మీదుగా అంతా సజావుగా సాగేందుకు అమెరికా బలాలు అక్కడ ఉంటాయని స్పష్టం చేశారు. సానుకూల చర్యలు చేపట్టి వాణిజ్యపరంగా ముందుడుగు చేయడానికి ఇది గొప్ప అవకాశమని పేర్కొన్నారు. 
 
అన్నీ సవ్యంగా జరగడానికి అమెరికా తప్పుకుండా మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. అమెరికా మాదిరి ఇరాన్ కూడా మంచి రోజులు రానున్నాయని అన్నారు. యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించిన వెంటనే కూడా ట్రంప్ ఓ పోస్టు పెట్టారు. తమ సైనిక లక్ష్యాలు నెరవేరాయని, ఇరాన్‍‌తో దీర్ఘకాలిక శాంతి కోసం ఇది ఒక ముందడుగని పేర్కొన్నారు. 
 
ఇరాన్, అమెరికా కాల్పుల విరణలో చైనా పాత్ర ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇరాన్ కాల్పుల విరమణపై చర్చలకు ఒప్పించండంలో చైనా ప్రమేయం ఉందా అని మీడియా ప్రతినిధులు ట్రంప్‌ను ప్రశ్నించారు. దానికి ఆయన, అది నేను కూడా విన్నానని, అందులో వాస్తవం ఉందనే అనుకుంటున్నానని సమాధానమిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దౌత్య చర్చలే సంఘర్షణలకు ముగింపు : భారత విదేశాంగ శాఖ