Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మో... 400 అస్థిపంజరాలా.. కాలేజీ కింద భూత గృహం... ఎక్కడ?

అమ్మో... 400 అస్థిపంజరాలా.. కాలేజీ కింద భూత గృహం... ఎక్కడ?
, బుధవారం, 1 ఏప్రియల్ 2015 (20:33 IST)
ఒక ఇంట్లో మనిషి చనిపోయాడంటే ఉండాలంటే భయపడతాం. ఇక ఇంటి కింద శవాన్ని పూడ్చారంటే వణుకు వస్తుంది. మరి శవాలను గృహమే ఉందంటే అమ్మో.. గుండె గుబేళంటుంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 400 మందిని పాతిపెట్టిన భూతగృహమంటే ఇంకేమైనా ఉందా... గుండె ఆగిపోదూ... మరి ఇది నిజమే... ఇలాంటి గృహాన్ని బ్రిటన్ పురావస్తుశాఖ వెలికితీసింది. పైగా అస్తి పంజరాలపై పరిశోధనలు కూడా చేస్తోంది. ఎక్కడా...? రండి తెలుసుకుందాం. 
 
webdunia
బ్రిటన్‌‌‌‌‌‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన సెయింట్ జాన్స్ కాలేజీ భవనానికి ఈ భవనానికి  మరమ్మతులు చేపట్టారు. ఈ తవ్వకాల్లో భారీఎత్తున అస్థిపంజరాలు బయట పడ్డాయి. దీంతో పురావస్తు శాఖ రంగంలోకి దిగింది. అస్థిపంజరాలు కాదు ఏకంగా శ్మశానమే ఉందని తెలుసుకుని కొయ్యబారిపోయారు. 
 
దాదాపు 400 అస్థిపంజరాలు చెక్కుచెదరకుండా ఉండగా,మరిన్ని స్కెలెటన్స్ ఏ భాగానికాభాగం వేరైపోయి ఎముకలే కనిపించాయి. సుమారు మూడేళ్ళ క్రితం ఈ పరిశోధనలు జరిగినా దాన్ని దాచిపెట్టారు. తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టారు. బహుశా మధ్యయుగం నాటి శ్మశానాలతో  ఈ ప్రాంతాన్ని పోల్చవచ్చునని వాళ్ళు అంటున్నారు. 
 
webdunia
అస్తిపంజరాలకు డీఎన్ఏ టెస్టుల ద్వారా వాటి కాలాన్ని తెలుసుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇక్కడ 1511 ప్రాంతంలో ఇక్కడ ఓ ఆసుపత్రి ఉండేదని తెలుస్తోంది. అందులోని రోగులు మరణించినప్పుడు వారి శవాలను ఆసుపత్రి కిందే ఖననం చేసినట్టు ఉందని అనుకుంటున్నారు. మొత్తంపై విషయం తేలాలంటే డిఎన్ఏ రిపోర్టులు రావాల్సిందే. 
 

Share this Story:

Follow Webdunia telugu