Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్జాతీయ సరిహద్దుల మూసివేత.... 22 నుంచి విమాన సర్వీసులు నిలిపివేత

Webdunia
గురువారం, 19 మార్చి 2020 (18:34 IST)
కరోనా వైరస్ ఓ మహమ్మారిగా మారింది. ఇప్పటికే ప్రపంచంలోని అనేక దేశాలను వణికించిన ఈ వైరస్... ఇపుడు భారత్‌ను కూడా గడగడలాడిస్తోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే అనేక మందికి ఈ వైరస్ సోకింది. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా మరికొన్ని మార్గదర్శకాలను జారీచేసింది. 
 
ఇందులో.. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు ఇళ్లకే పరిమితం కావాలని, బయటికి రావొద్దని సూచించింది. 12 ఏళ్ల లోపు ఉన్న పిల్లలను కూడా బహిరంగ ప్రదేశాల్లో తిరగనివ్వరాదని పేర్కొంది. అంతేకాకుండా, దేశవ్యాప్తంగా అంతర్జాతీయ, వాణిజ్య విమానాలకు అనుమతి నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 22 నుంచి కనీసం వారం రోజుల పాటు అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతి ఉండదని పేర్కొన్నారు.
 
విదేశాల నుంచి స్వదేశానికి వచ్చిన అనేక మంది విమానాశ్రయాల నుంచి తప్పించుకుని రైలు మార్గాలు, రోడ్డు మార్గాల ద్వారా వెళ్లిపోతున్నందున వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలంటే విమాన సర్వీసుల నిలిపివేత తప్పదని కేంద్రం భావించింది. విమాన సర్వీసుల నిలిపివేత 22 అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని, అప్పటివరకు అంతర్జాతీయ విమాన సర్వీసుల ద్వారా భారత్ చేరుకునే ప్రతి ఒక్క ప్రయాణికుడిని క్వారంటైన్ శిబిరాలకు తరలించాలని కేంద్రం ఆదేశించింది. 14 రోజుల పరిశీలన తర్వాత వారికి ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని తేలితేనే బయటికి పంపాలని స్పష్టం చేసింది.
 
ప్రజా రవాణా సంస్థలు సర్వీసులు తగ్గించుకోవాలని సూచించింది. వారం పాటు అంతర్జాతీయ సరిహద్దులు కూడా మూసివేస్తున్నట్టు స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ గ్రూప్ బి, సి ఉద్యోగులు 50 శాతం మంది మాత్రమే కార్యాలయాలకు రావాలని, మిగిలిన 50 శాతం మంది సిబ్బందిని ఇంటి నుంచే పనిచేయాలని పేర్కొంది. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని వివరించింది. 
 
పంజాబ్‌లో మరొకరి మృతి 
మరోవైపు, గురువారం మధ్యాహ్నానికి దేశంలో మొత్తం 167 కరోనా కేసులు నమోదైనట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వారిలో 25 మంది విదేశీయులు. ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్, మహారాష్ట్రల్లో ఒక్కొక్కటి చొప్పున 4 మరణాలు సంభవించాయి. తాజాగా పంజాబ్ లో 72 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మరణించినట్టు నిర్ధారించారు. దీంతో కరోనా వైరస్ కారణంగా చనిపోయినవారి సంఖ్య నాలుగుకు చేరింది. ఈయన ఇటీవలే ఇటలీ నుంచి వచ్చి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments