Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెల్ల పెట్టెల్లో సిగరెట్‌ల విక్రయం... త్వరలో కొత్త చట్టం..!

తెల్ల పెట్టెల్లో సిగరెట్‌ల విక్రయం... త్వరలో కొత్త చట్టం..!
, శుక్రవారం, 23 జనవరి 2015 (19:37 IST)
సిగరెట్ సంస్థలు వినియోగదారులను ఆకర్షించే రీతిలో రంగు రంగు పెట్టెల్లో, ఆయా సంస్థల పేర్లు, లోగోలను ముద్రించి ఇన్నాళ్లు విక్రయిస్తూ వచ్చాయి. సిగరెట్ సేవించడం వలన క్యాన్స వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయని చెప్పినా పొగతాగే వారి సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. 
 
దీంతో పొగరాయుళ్ల ఆకర్షణను కాస్త తగ్గించేందుకు, పొగతాగడం వలన కలిగే నష్టాన్ని వారికి చూపే రీతిలో ఆస్ట్రేలియా సిగరెట్ పెట్టెలను తెల్ల రంగులో తయారు చేసి వాటిపై, స్లోగన్‌లు, దాన్ని తాగడం వల్ల ఏర్పడే నష్టాలను తెలుపుతూ చిత్రాలను ముద్రించింది. 
 
అది మంచి ఫతిలాన్ని ఇవ్వడంతో అమెరికా కూడా ఈ కొత్త విధానాన్ని అమలు చేయాలని తలచింది. అంతేకాకుండా ఆ మేరకు దేశంలో కొత్త చట్టాన్ని తేవాలని నిర్ణయించింది. దీంతో ఇకపై అక్కడ సిగరెట్ బాక్స్‌లు తెల్లరంగులోను దానిపై పొగాకు వల్ల కలిగే అనారోగ్యాలను చూపే చిత్రపటాలు, స్లోగన్‌లను ముద్రించనున్నారు. 
 
ఇక పోతే ఇప్పటి వరకు భారత దేశంలో పొగాకు వస్తువులైన పాన్‌పరాగ్, గుట్కా, కైనీ, హన్సి వంటి వస్తువు ప్యాకెట్‌ల మాత్రమే వాటిని ఉపయోగించడం వలన కలిగే నష్టాలను తెలుపుతూ స్లోగన్‌లు, ఫోటోలను ఉంచారు. త్వరలో భారత్‌లో కూడా తెల్ల పెట్టెల్లో సిగరెట్‌ల విక్రయం జరిగే అవకాశం కనిపిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu