చైనాలో శునకాల పందేలు ఫేమస్. సంక్రాంతి అంటే మనకందరికీ కోడి, పొట్టేలు, ఎడ్లబళ్ల పందేలు గుర్తొచ్చేలా.. చైనాలో కొత్త సంప్రదాయం ఉంది. కానీ కాస్త విభిన్నంగా చైనాలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో ప్రధానంగా శునకాల పందేలు జరుగుతాయి.
శునకాల పందేలంటే, బాక్సింగ్లా ఉంటాయి. రెండు కుక్కలను బరిలో వదులుతారు. ఆ రెండు కుక్కలూ కసిదీరా కరుచుకుంటాయి. ఏది విజేతగా నిలుస్తుందో దానికి సిగరెట్ పాకెట్ బహుమతిగా ఇస్తారు.
ఆ సిగరెట్ పాకెట్ను ఓడిన వారు గెలిచిన వారికిస్తారు. దానిని వెలిగించి ఇద్దరూ స్నేహం వ్యక్తం చేస్తారు. స్నేహం ముందు, పోటీ తరువాత అనే దృక్పథంతో ఈ పోటీలను నిర్వహిస్తారు. ఈ పోటీలకు చైనాలో భారీ క్రేజ్ ఉంది.