Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మొసలిని ముద్దుపెట్టుకుంటే ఉద్యోగం ఖాయం?.. ఎక్కడ?

మొసలిని ముద్దుపెట్టుకుంటే ఉద్యోగం ఖాయం?.. ఎక్కడ?
, సోమవారం, 6 జులై 2015 (10:37 IST)
గర్భందాల్చాలంటే ముందుగా తమ వద్ద అనుమతి తీసుకోవాల్సిందేనంటూ నిన్నటికినిన్న ఓ చైనా కంపెనీ తమ మహిళా ఉద్యోగులకు ఆంక్షలు విధించింది. ఇపుడు.. ఉద్యోగం కావాలంటే మొసలిని ముద్దు పెట్టుకోవాలంటూ మరో కంపెనీ ప్రకటించింది. ఈ నిబంధనను ఆ కంపెనీ తప్పనిసరి చేసింది కూడా. దీంతో పలువురు యువతులు మొసలిని ముద్దుపెట్టుకుని ఉద్యోగంలో చేరారు. ఈ సంఘటన కూడా కమ్యూనిస్టు దేశం చైనాలో జరిగింది. 
 
గ్వాంగ్‌డాంగ్ రాష్ట్రంలో ఓ కంపెనీ సేల్స్ విమెన్ ఉద్యోగాలకు ఇంటర్వూ నిర్వహించింది. ఈ ఇంటర్వూకు వచ్చే అమ్మాయిలు అందంగా ఉండడమే కాకుండా.. తెలివైన వాళ్లు కూడా ఉండాలని షరతు పెట్టింది. ఈ షరతుకులోబడి దరఖాస్తు చేసుకుని ఇంటర్వూకి హాజరైన అమ్మాయిలు తొలి రౌండ్ పరీక్ష చూసి విస్తుపోయారు. 
 
దీనికి కారణం సజీవంగా ఉన్న మొసలి నోటి మీద ముద్దుపెట్టుకువాలని సూచించడం. ఇలాంటి పరీక్ష ఏమిటని ప్రశ్నిస్తే.. అమ్మాయిలు అందంగా, తెలివైన వాళ్లుగా ఉండడమే కాదు.. వారికి విపరీతమైన ధైర్య, సాహసాలు కూడా ఉండాలని, అందుకే ఈ తరహా పరీక్ష అని అధికారులు చెప్పారు. మొసలి చర్మం, మాంసంతో తయారు చేసే ఆరోగ్య ఉత్పత్తులను తాము విక్రయిస్తామని, అందుకనే తాము ఇలాంటి పరీక్ష పెట్టామని సదరు కంపెనీ యాజమాన్యం సమర్థించుకుంది.

Share this Story:

Follow Webdunia telugu