Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యుద్ధానికి సిద్ధమైన చైనా... మన వాయుసేన విమానం బంగాళాఖాతంలో...

దక్షిణ చైనా సముద్రంపై చారిత్రక హక్కును కోల్పోయిన చైనా ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. జలాలపై హక్కులు కోరుతూ ఐక్యరాజ్య సమితి కోర్టును ఆశ్రయించిన ఫిలిఫ్పీన్స్, ఇతర ద్వీపదేశాలపై యుద్ధానికి సిద్ధమంటూ సంకేతాలిచ్చింది. దక్షిణ చైనా సముద్రంలోని తన స్థావరంలో భార

యుద్ధానికి సిద్ధమైన చైనా... మన వాయుసేన విమానం బంగాళాఖాతంలో...
, శనివారం, 23 జులై 2016 (14:20 IST)
దక్షిణ చైనా సముద్రంపై చారిత్రక హక్కును కోల్పోయిన చైనా ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. జలాలపై హక్కులు కోరుతూ ఐక్యరాజ్య సమితి కోర్టును ఆశ్రయించిన ఫిలిఫ్పీన్స్, ఇతర ద్వీపదేశాలపై యుద్ధానికి సిద్ధమంటూ సంకేతాలిచ్చింది. దక్షిణ చైనా సముద్రంలోని తన స్థావరంలో భారీ ఎత్తున విధ్వంసక ఆయుధాలు, క్షిపణులను మోహరించింది. వీటికి సంబంధించిన దృశ్యాలను అధికారిక చానెల్‌లో ప్రసారం చేసింది. 'యుద్ధానికి సన్నద్ధులు కండి.. ఏ క్షణమైనా ఉత్పాతాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి' అని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) అత్యున్నత స్థాయి అధికారులు సైనికులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో దక్షిణ చైనా సముద్రంలో ఉద్రక్త పరిస్థితులు నెలకొన్నాయి.
 
దాదాపు 1500 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేధించగలిగే అత్యాధునిక మిస్సైళ్లతో పాటు, 70 ఏళ్లుగా చైనీస్ ఆర్మీ అమ్ములపొదిలో ఉన్న డీఎఫ్- 16 క్షిపణులను, మరికొంత ఆయుధ సంపత్తిని దక్షిణ చైనా సముద్ర స్థావరంలో మోహరించిన చైనా.. ఆ ప్రాంతంలోకి పెద్దఎత్తున సైనిక బలగాలను దించుతోంది. అంతేకాదు.. సైనిక నిర్ణయాలపై నిర్ణయం తీసుకోగల రెండో అత్యున్నత వ్యక్తి సెంట్రల్ మిలటరీ కమిషన్ ఉపాధ్యక్షుడు జనరల్ ఫాన్ చాంగ్ లాంగ్ (అధ్యక్షుడు జింగ్ పిన్ తర్వాతి స్థానం ఈయనదే) శుక్రవారం దక్షిణ చైనా సముద్రంలోని స్థావరాన్ని సందర్శించి యుద్ధానికి సిద్ధంగా ఉండండంటూ సైనికులను ఆదేశించారు. ఆయన వెంట పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ కమాండర్ జనరల్ జెన్ మా జియోటియాన్, క్షిపణి విభాగం చీఫ్ జనరల్ వే ఫెంగే తదితర ఉన్నతాధికారులు ఉన్నారు.
 
మరోవైపు అమెరికా.. ఫిలిప్పీన్స్‌కు అత్యాధునిక ఎలక్ట్రానిక్ ఆయుధాలను సరఫరా చేస్తోంది. ఫిలిప్పీన్స్‌కు సమీప దీవిలో గల యూఎస్ ఎయిర్ బేస్(క్లార్క్ బేస్) నుంచి ఈ సరఫరా వ్యవహారం కొనసాగుతోంది. ఒకవేళ చైనా ఫిలిఫ్పీన్స్, ఇతర ద్వీపాలపై దురాక్రమణకు దిగితే.. ఆ దేశాలకు అమెరికా దన్నుగా నిలుస్తుందా లేక తోకముడుస్తుందా అనే విషయంపై అప్పుడే చర్చలు మొదలయ్యాయి. దక్షిణ చైనా సముద్ర జలాలపై చైనాకు చారిత్రక హక్కులు లేవని సముద్ర జలాల చట్టాలపై ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన కూటమి (UNCLOS) గత వారం తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే చైనా ఆ కూటమిలో సభ్యురాలు కాకపోవడం గమనార్హం. 
 
ఉద్రక్తతల నడుమ చైనా సరిహద్దులో అప్రమత్తత ప్రకటించిన భారత్ పెద్దఎత్తున యుద్ధట్యాంకులు, సైన్యాలను మోహరిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు మన వాయుసేన విమానం ఒకటి బంగాళాఖాతంలో కూలిపోవడంతో యుద్ధ నౌకలు, విమానాలు దాని ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమించకుంటే చంపేస్తానన్నాడు... చదువు తప్ప వేరే లోకం తెలియని చిట్టితల్లి ప్రాణాలు తీసుకుంది!