Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రెగ్నెన్సీకి అనుమతి తీసుకోవాల్సిందే... ప్లాన్ పాటించకుంటే ఫైన్.. ఎక్కడ?

ప్రెగ్నెన్సీకి అనుమతి తీసుకోవాల్సిందే... ప్లాన్ పాటించకుంటే ఫైన్.. ఎక్కడ?
, శనివారం, 4 జులై 2015 (12:02 IST)
ప్రపంచంలో ఉన్న దేశాల్లో కరుడుగట్టిన కమ్యూనిస్టు దేశంగా చైనాకు గుర్తింపువుంది. ఈ దేశంలోని ఓ కంపెనీ యాజమాన్యం తమ సంస్థలో పని చేసే కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. కుటుంబ నియంత్రణ పాటించకుండా తమ ఇష్టానుసారంగా గర్భందాలిస్తే సహించేదిలేదని, ప్రెగ్నెన్సీ గురించిన ప్రణాళికలు ముందుగానే కంపెనీకి తెలియజేయాలని నిబంధన పెట్టింది. ఒకవేళ ఆ నిబంధనల్ని అతిక్రమిస్తే వంద యువన్ల (11,239 రూపాయలు) అపరాధం చెల్లించాల్సి ఉంటుందని షరతు విధించింది. 
 
ఈ కంపెనీ చైనాలోని హెనాన్ ప్రావిన్స్ పరిధిలో ఉంది. కంపెనీలో ఎక్కువగా మహిళలకే అవకాశం ఇస్తుంది. ఈ కంపెనీలో చేరే మహిళా ఉద్యోగినులు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చే సమయంలో తమ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ గురించి ముందుగానే అందులో రాయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ అప్లికేషన్‌లో రాసిన దాన్ని పాటించకపోతే వారికి జరిమానా తప్పదని హెచ్చరించింది. అంతేకాదు మాట తప్పిన వారికి పదోన్నతులు, ప్రోత్సహకాల్లో కూడా కోతలు విదిస్తున్నట్టు తెలిసింది.

Share this Story:

Follow Webdunia telugu