Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హోటళ్లలో డబ్బుతో పనిలేదు... అంతా కార్డుల మయం..!

హోటళ్లలో డబ్బుతో పనిలేదు... అంతా కార్డుల మయం..!
, మంగళవారం, 3 మార్చి 2015 (18:16 IST)
దేశంలో నల్లధనాన్ని అరికట్టేందుకు, నగదు లావాదేవీలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్న రీతిలో కొత్త చర్యలను చేపడుతోంది. ఇందులో భాగంగా ఇక మీదట దేశంలో ఉన్న ఎక్కడి ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లకు వెళ్లినా, అక్కడ డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు. హోటల్ బిల్లుకైనా, దూర ప్రాంత విమానం టిక్కెట్, లగ్జరీ కార్లు అద్దెకు తీసుకోవాలన్నా, ఖరీదైన విలాస వస్తువులు కొనాలన్నా అన్నిటికీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల ద్వారానే చెల్లింపులు జరపాలు.
 
హై వాల్యూ లావాదేవీలపై దృష్టిని సారించిన కేంద్రం నల్ల ధనాన్ని అరికట్టేందుకు ఈ మేరకు నిర్ణయాలు ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఒక పరిధి దాటిన తరువాత చెల్లింపులన్నీ బ్యాంకు మాధ్యమంగానే జరగాలన్న నిబంధన అమలులోకి రానుంది. బ్లాక్ మనీని ఆపాలంటే నగదు లావాదేవీలు గణనీయంగా తగ్గాల్సివుందని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆర్థిక శాఖకు సిఫార్సులు సమర్పించిన నేపథ్యంలో నగదు లావాదేవీలకు పరిమితి పెట్టాలని భావించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu