Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్రిటన్ నిరుద్యోగి.. 10 మంది భార్యలు.. 15 మంది పిల్లలు!

బ్రిటన్ నిరుద్యోగి.. 10 మంది భార్యలు.. 15 మంది పిల్లలు!
, బుధవారం, 1 ఏప్రియల్ 2015 (08:42 IST)
బ్రిటన్‌కు చెందిన ఓ నిరుద్యోగి ఓ ఘనకార్యం చేశారు. ఉద్యోగం లేదు.. కానీ 10 మంది భార్యలు.. 15 మంది పిల్లలున్నారు. అలాగని ఆయన అరబ్‌ షేకో.. 50-60 ఏళ్లుంటాయో అనుకుంటే అదీ పొరపాటే అవుతుంది. వయస్సు కేవలం 29 యేళ్లు మాత్రమే. త్వరలోనే 16వ బిడ్డకు తండ్రి కాబోతున్నాడు. అతని పేరు కీత్‌ మెక్‌ డొనాల్డ్‌. ఇంగ్లండ్‌కు చెందిన యువకుడు. 
 
తన బహు భార్యత్వంపై స్పందిస్తూ.. ‘తొమ్మిది నెలల క్రితం నేను శృంగారంలో పాల్గొన్నా.. ఆమె ఇప్పుడు 16వ బిడ్డకు తల్లి కాబోతోంది. అమ్మాయిలను పడేయటం చాలా సులభం. అందుకోసం నేను సుందర్‌లాండ్స్‌ నుంచి బర్మింగ్‌హామ్‌కు బస్సులు, రైళ్లలో ప్రయాణిస్తా. ఫోన్‌ నెంబర్‌ తీసుకుని ఛాటింగ్‌ చేస్తా.. లైన్లో పెడతా.. వాళ్లు కూడా వద్దని చెప్పలేరు. నా పిల్లల తల్లుల్లో చాలా మందితో బస్సుల్లో పరిచయం ఏర్పడిన వారే’ అని ఓ డాక్యుమెంటరీ ఇంటర్వ్యూలో చెప్పాడు. 
 
15 ఏళ్ల వయస్సులోనే మెక్‌ డొనాల్డ్‌ మొదటిసారి తండ్రయ్యాడు. 20 దాటే సరికి ఆరుగురు పిల్లలు పుట్టారు. శృంగారంలో గర్భ నిరోధక పద్ధతులు పాటించటం ఈయనకు ఇష్టం ఉండదట. ఇంత చేసినా సవ్యంగా ఎలా సాగుతోందనుకోకండి. 2011లో తొమ్మిదో సంతానం విషయంలో గొడవ జరిగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నాటకాలాడాడు. 
 
అలాగే, 2012 నవంబర్‌లో ఇలాగే భార్యతో గొడవ పడినందుకు సుందర్‌లాండ్స్‌ మేజిస్ట్రేట్ హెచ్చరికలు అందుకున్నాడు. బ్రిటన్‌ ప్రభుత్వం అశక్తులకు ఇచ్చే పెన్షన్‌ (ఇన్‌కెపాసిటీ బెనిఫిట్స్‌) రూపంలో మెక్‌ డొనాల్డ్‌కు వారానికి 69 పౌండ్లు (ఆరున్నర వేల రూపాయలు) వస్తాయి. అందరు పిల్లలకు కలిపి 500 రూపాయలు ఖర్చు పెడతానని ఈ 16 బిడ్డల తండ్రి చెప్పాడు. 

Share this Story:

Follow Webdunia telugu