Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐప్యాడ్‌ను చూసి ముచ్చటపడిన డాల్ఫిన్... తర్వాత ఏం చేసింది?

మహిళ చేతిలో ఉన్న ఐప్యాడ్‌ మీద మనసు పారేసుకుని దాన్ని అమాంతంగా లాగేసుకుంది ఓ డాల్ఫిన్. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో సీవరల్డ్‌లో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే.. సీవరల్డ్‌లో ఓ మహిళ పడవలో నిల్చుని

ఐప్యాడ్‌ను చూసి ముచ్చటపడిన డాల్ఫిన్... తర్వాత ఏం చేసింది?
, బుధవారం, 10 ఆగస్టు 2016 (12:09 IST)
మహిళ చేతిలో ఉన్న ఐప్యాడ్‌ మీద మనసు పారేసుకుని దాన్ని అమాంతంగా లాగేసుకుంది ఓ డాల్ఫిన్. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో సీవరల్డ్‌లో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే.. సీవరల్డ్‌లో ఓ మహిళ పడవలో నిల్చుని ఐప్యాడ్‌తో డాల్ఫిన్లను ఫొటోలు తీసుకుంటోంది. ఉన్నట్టుండి ఓ డాల్ఫిన్‌ ఆ ఐప్యాడ్‌ని చూసి ముచ్చటపడింది. తన అందాల్ని అందులో బంధించాలని ఆశపడింది. పడవ దగ్గర వచ్చిన డాల్ఫిన్‌ని ఆ మహిళ ఫొటోలు తీసే పనిలో నిమగ్నమైపోవడంతో... ఇదే అదనుగా భావించిన ఆ డాల్ఫిన్‌ మహిళ దగ్గరకు వచ్చి ఉన్నట్టుండి పైకి లేచి ఐప్యాడ్‌ను నోటితో పట్టుకుని లాక్కుంది. 
 
వెంటనే స్పందిన మహిళ డాల్ఫిన్‌ దగ్గరి నుంచి ఐప్యాడ్‌ లాగేసుకుంది. ఈ ఉదంతాన్ని అక్కడే ఉన్న మరో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఓర్లాండోలోని ఈ సీవరల్డ్‌లో పర్యాటకులు డాల్ఫిన్లను తాకుతుంటారు. పడవల్లో వెళ్తుంటే డాల్ఫిన్లు దగ్గరగా వస్తుంటాయి. వాటితో సరదాగా ఫోటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాజీ ఎమ్మెల్యే కుతూహలమ్మ ఎక్కడ...? తెదేపాలో ఉన్నారా...