Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బిల్ క్లింటన్ బాగోతం: అపార్ట్‌మెంట్‌లో ప్రలోభ పెట్టాలని చూశాడన్న జాక్వలిన్

బిల్ క్లింటన్ బాగోతం: అపార్ట్‌మెంట్‌లో ప్రలోభ పెట్టాలని చూశాడన్న జాక్వలిన్
, సోమవారం, 30 నవంబరు 2015 (20:55 IST)
''బిల్ అండ్ హ్యారీ: సో దిస్ ఈడ్ దట్ థింగ్ కాల్డ్ లవ్'' అనే పుస్తకంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ బాగోతం బయటపడింది. బిల్ క్లింటన్ తనను ప్రలోభ పెట్టాలని చూశాడని.. అతి కష్టం మీద తప్పించుకున్నానని.. తనను కాపాడుకునేందుకు దూరంగా తోసేసానని అమెరికా 35వ మాజీ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్ కెన్నడీ భార్య అయిన జాక్వలిన్‌ తాజా పుస్తకంలో వివరించారు. ఈ పుస్తకం రచయితలు డార్విన్ పార్టర్, డాన్‌ఫోర్త్ ప్రిన్స్ పుస్తకంలోని కీలక విషయాలను తెలిపారు.
 
ఈ పుస్తకంలో క్లింటన్ గురించి జాక్వలిన్ ఇంకా చెప్పిన విషయాలకు వస్తే... లైంగిక సంబంధాల విషయంలో క్లింటన్ కూడా తన భర్త జాన్‌ ఎఫ్‌ కెన్నడీ లాగా పేరుమోసిన వాడే నన్నారు. నో' అనే సమాధానం వస్తే సహించేవారు కాదని జాక్వలిన్ ఓ సందర్భంలో తన స్నేహితురాలితో చెప్పిందని పుస్తకంలో పేర్కొన్నారు. న్యూయార్క్ అపార్ట్‌మెంట్‌లో జాక్వలిన్‌ను ప్రలోభపెట్టేందుకు బిల్ క్లింటన్ సాయశక్తులా ప్రయత్నించారని అయితే అది జరగలేదని డార్విన్ పార్టర్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu