Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గడ్డంతో 26 ఏళ్ల మహిళకు తంటాలు.. అయినా ఆత్మవిశ్వాసం మాత్రం బాగా పెరిగిందట!

సాధారణంగా మగవాళ్లకు గడ్డం వస్తేనే చిరాకుపడుతుంటారు. అలాంటిది ఆడవాళ్లకి వస్తే ఆమె వేదనని మాటల్లో చెప్పలేం. ఇలాంటి పరిస్థితి అమెరికాకు చెందిన ఓ మహిళ గత 26 ఏళ్లుగా అవాంచిత రోమాలతో బాధపడుతోంది. రోస్ గియిల

గడ్డంతో 26 ఏళ్ల మహిళకు తంటాలు.. అయినా ఆత్మవిశ్వాసం మాత్రం బాగా పెరిగిందట!
, శుక్రవారం, 10 జూన్ 2016 (10:10 IST)
సాధారణంగా మగవాళ్లకు గడ్డం వస్తేనే చిరాకుపడుతుంటారు. అలాంటిది ఆడవాళ్లకి వస్తే ఆమె వేదనని మాటల్లో చెప్పలేం. ఇలాంటి పరిస్థితి అమెరికాకు చెందిన ఓ మహిళ గత 26 ఏళ్లుగా అవాంచిత రోమాలతో బాధపడుతోంది. రోస్ గియిల్(39)కు 13 ఏళ్లు ఉన్నప్పటి నుంచీ ముఖం, చేతులు, కాళ్లకు వెంట్రుకలు విపరీతంగా రావడంతో తీవ్ర ఆవేదనకు గురవుతోంది. 
 
ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ఆమెను ఒక భయం వెంటాడుతోంది, అదేంటంటే తెల్లారి లేవగానే తనను ఎవరూ చూడకూడదని, షేవింగ్ చేసుకున్న తర్వాతే తనను చూడాలని. ప్రతి రోజు ఉదయం షేవింగ్ చేసుకుంటుంది. కానీ ఒకరోజు మరిచిపోయింది. అయితే, ఆ రోజున పొరపాటున ఆమె తన తల్లికి అవాంఛిత రోమాలతో కనపడింది. అప్పుడు తల్లికి తన అవాంచిత రోమాల గురించి చెప్పి వాపోయింది. దీంతో ఆమె కుమార్తె దీనపరిస్థితిని చూసి బాధపడి వెంటనే క్లినిక్‌కు తీసుకెళ్లింది. 
 
కానీ, పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, హార్మోన్ల లోపం వల్ల వచ్చే సమస్యకు పరిష్కారం పూర్తిగా కనిపించదన్నారు. ఎన్నో రకాల మాత్రలు వాడినా, మెడిటేషన్ కూడా చేసినా ప్రయోజనం లేదని రోస్ వాపోయింది. టాబ్లెట్లు, క్రీములు, వాక్సినేషన్ ఇలా ఎన్నో చేయించుకున్నా ఫలితం లేదని బాధపడింది. ఎవరికైనా తన సీక్రెట్ లీక్ అవుతుందని ఎన్నోసార్లు భయపడ్డానని రోస్ తన బాధను వెల్లడించింది. 
 
అవాంచిత రోమాలను తొలగించేందుకు ఎంతో ఖర్చుచేసి, షేవింగ్, ఎంతో మానసిక బాధను అనుభవించి విసిగిపోయింది. ఎవరేమనుకున్నా అనుకోనీ అని గత రెండు నెలలుగా షేవింగ్ చేయడం మానేసింది. దీంతో విషయం ఆమె స్నేహితులు, బంధువులు అందరికీ తెలిసిపోయింది. తన బాధను అర్థం చేసుకున్నారు. ఇప్పుడు వారంతా ఆమె గడ్డానికి ఫిదా అయిపోయారు. ఇంతకాలం ఏ గడ్డమైతే అందరి నుంచి తనను దూరం చేసిందో, అదే గడ్డం తనలో ఆత్మవిశ్వాసం నింపుతోందని ఆమె వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల బూందీ తయారీ పోటులో అగ్నిప్రమాదం.. రూ.20 లక్షల నష్టం..!