Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మిర్చి సాస్‌తో స్నానం చేస్తే ఒళ్లు మండిపోదూ.. 1250 బాటిళ్ల సాస్‌లో మునిగిన ఘనుడు! (video)

చిన్ని పచ్చిమిర్చి ముక్కను పొరపాటున కొరికేస్తేనే ఘాటు తలకెక్కుతుంది. అలాంటిది 1250 బాటిళ్ల సాస్‌లో ఓ ఘనుడు మునిగాడంట. ఇంకేంముంది.. ఒళ్ళంతా మండిపోయింది. అంతే.. ఒకటే గగ్గోలు పెట్టాడు. పెద్దగా కేకలు పెట్

మిర్చి సాస్‌తో స్నానం చేస్తే ఒళ్లు మండిపోదూ.. 1250 బాటిళ్ల సాస్‌లో మునిగిన ఘనుడు! (video)
, గురువారం, 25 ఆగస్టు 2016 (18:21 IST)
చిన్ని పచ్చిమిర్చి ముక్కను పొరపాటున కొరికేస్తేనే ఘాటు తలకెక్కుతుంది. అలాంటిది 1250 బాటిళ్ల సాస్‌లో ఓ ఘనుడు మునిగాడంట. ఇంకేంముంది.. ఒళ్ళంతా మండిపోయింది. అంతే.. ఒకటే గగ్గోలు పెట్టాడు. పెద్దగా కేకలు పెట్టాడు. అయితే ఇదంతా పాపులారిటీ కోసం. 1250 బాటిళ్ల మిరపకాయల సాస్‌లో తాను స్నానం చేశానని గొప్పగా చెప్పుకోవడానికి.. ఆ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. 
 
మిర్చి బాధను తట్టుకుని అనుకున్న పాపులారిటీ సాధించాడు. ఈ వీడియోకు 25 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. అమెరికాకు చెందిన క్యాండర్ అనే వ్యక్తి ఈ ప్రయోగం చేశాడు. మిర్చి సాస్‌తో నిండిన టబ్‌లో.. ఒంటిపై బట్టలు లేకుండా.. ఒక లోయర్ మాత్రం ధరించి అందులో మునిగాడు. అయితే మిర్చి ఘాటుకు ఒళ్లంతా మండిపోయింది. అంతే వెంటనే షవర్ కిందికి వెళ్ళిపోయాడు. ఉపశమనం కోసం ప్రయత్నించాడు. 
 
అయితే మిర్చి మంట ఏమాత్రం తగ్గలేదు. కానీ వ్యూవ్స్ మాత్రం కొట్టేశాడు. ఈ ప్రయోగం ఓ భయంకరమైన సినిమా చూసినట్టుందని అనేక మంది కామెంట్ చేశారు. కొందరు అయ్యో పాపం అన్నారు. కొందరు ఇదేం పిచ్చి అన్నారు. మొత్తానికి మిర్చి మొనగాడు అనిపించుకున్నాడు.. ఈ అమెరికా కుర్రాడు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డేటింగ్ పేరుతో పరిచయం.. రెస్టారెంట్లో ఎంజాయ్.. యువకుడి హతం.. ఎలా?