Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎత్తిన బీరు గ్లాసు దించకుండా తాగేసిన ఆసీస్ ప్రధాని టోనీ అబ్బాట్!

ఎత్తిన బీరు గ్లాసు దించకుండా తాగేసిన ఆసీస్ ప్రధాని టోనీ అబ్బాట్!
, సోమవారం, 20 ఏప్రియల్ 2015 (12:25 IST)
ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి టోనీ అబ్బాట్ ఎత్తిన బీరు గ్లాసు దించకుండా తాగేశారు. అది కూడా కేవలం 7 సెకన్లలోనే కావడం గమనార్హం. అధికారులు, అభిమానులు ప్రోత్సహించడంతో అబ్బాట్ బీరు గ్లాసును దించకుండానే.. ఫుల్‌గా తాగేశారు. రూల్స్ ఫుట్‌బాల్ ఆటగాళ్ల కోసం సిడ్నీలోని ఓ పబ్‌లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి టోనీ అబ్బాట్ హాజరయ్యారు. ఈ సమయంలోనే అభిమానులు, అధికారుల హర్షధ్వానాల మధ్య గ్లాసు దించకుండా బీరు తాగేశారు. అబ్బాట్ బీరు తాగిన దృశ్యాలు కెమెరా కంటికి చిక్కగా, అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి.
 
టోనీ తీరు అక్కడివారిని ఉత్సాహ పర్చగా.. మద్య సేవనం తగ్గించుకోవాల్సిన అవసరంపై మంచి మాటలు చెప్పాల్సిందిపోయి టోనీనే స్వయంగా మద్యం సేవించి ప్రజలకు చెడు సంకేతాలిస్తున్నారని మరికొందరు మండిపడుతున్నారు. ఆస్ట్రేలియాలో మద్యం సేవిస్తున్నవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, గతంలో ప్రధాని టోనీ కూడా మద్యం సేవిస్తున్నవారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతిగా మద్యం సేవించడం మంచిది కాదని హితవు పలికారు. 

Share this Story:

Follow Webdunia telugu