Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒబామా పర్యటనతో కలవరపడుతున్న చైనా.. ప్రత్యేక పరేడ్ కు అతిథిగా పుతిన్ ?

ఒబామా పర్యటనతో కలవరపడుతున్న చైనా.. ప్రత్యేక పరేడ్ కు అతిథిగా పుతిన్ ?
, బుధవారం, 28 జనవరి 2015 (07:32 IST)
ఒబామా భారత పర్యటన పొరుగు దేశం చైనాకు కంటగింపుగా మారింది. ఇక్కడ వచ్చిన తరువాత ఒబామా వ్యవహరించిన తీరు, స్నేహపూరిత వాతావరణం, కలిసి పోయిన తీరు ఇవన్నీ చైనాకు ఇబ్బందికరంగా మారాయి. అంతకు అంత చేయాలనే ఆలోచనలో చైనా ఉంది. తాము కూడా పెద్ద ప్రదర్శనకు దిగాలని యోచిస్తోంది. ఇందుకు సందర్భాన్ని వెతుక్కుంది. రెండో ప్రపంచ యుద్ధ విజయాలకు 70 యేళ్లు నిండాయనీ, దానిని పురస్కరించుకుని ఓ పెద్ద పరేడ్ ను నిర్వహించాలని అనుకుంటోంది. ఈ పరేడ్ కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించాలని నిర్ణయించారు. 
 
దశాబ్దానికి ఒకసారి పరేడ్ నిర్వహించటం చైనాకు ఆనవాయితీ. కానీ.. ఒబామా ముందు భారత దేశం సైనిక సత్తా చాటడంతో చైనా ఇబ్బందిగా ఫీలవుతోంది. తాను కూడా బలప్రదర్శనకు దిగాలని యోచిస్తోంది. ప్రపంచ యుద్ధ విజయాల కారణంతో తానూ సైనిక బల ప్రదర్శన చేయాలని భావిస్తోంది. కాగా చైనా మీడియా అదే పనిగా భారత్‌కు హెచ్చరికలు జారీ చేసింది. ఒబామా న్యూఢిల్లీ పర్యటన వెనుక, చైనా భారత్‌ల సంబంధాలను దెబ్బతీయటమే ప్రధాన లక్ష్యమని పేర్కొంది. భారత్, అమెరికాల మధ్య పెరుగుతున్న స్నేహం చైనాతో పాటు రష్యాతో కూడా సంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని చైనా ప్రభుత్వ నేతృత్వంలో నడిచే గ్లోబల్ టైమ్స్ పత్రిక పేర్కొంది. 
 
webdunia
భారత గణతంత్ర వేడుకల్లో మోదీ, ఒబామాలు కలసి ఉన్న ఫొటోను ఈ పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. చైనాను ఇరుకున పెట్టేందుకు అమెరికా భారత్‌ను వినియోగించుకుంటోందని చైనా అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు ఝు ఫాన్‌యిన్ వ్యాఖ్యానించారు. కొత్త ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేయటం ద్వారా ఆసియా ప్రాంతంలో ఒక కొత్త శకానికి నాంది పలికినట్లయిందని కూడా పేర్కొన్నారు. దక్షిణాసియాలో అమెరికాకు భారత్ మిత్రపక్షంగా మారిందని ఆయన ఆరోపించారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించాలని, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం భారత్ లక్ష్యమని, ఈ రెండింటికి కూడా భారత్‌కు అమెరికా సహాయం చాలా అవసరమని అన్నారు. 
 
భద్రతామండలి సభ్యత్వం కంటే కూడా భారత్ చైనాల మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం కావటం, ఆసియాలో సుస్థిరత సాధించటం ముఖ్యమన్నారు. నిరుడు సెప్టెం బర్‌లో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించినప్పుడు ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాల అమ లు.. అమెరికాతో భారత్ స్నేహం వల్ల కష్టసాధ్యమవుతుందన్నారు. మొత్తంపై ఇరుదేశాల మధ్యన వాతావరణం వేడెక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu