Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌లో అత్యంత ఫాస్టెస్ట్ రైలు ఏది... గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రికార్డు బద్దలు.. త్వరలో పట్టాలపైకి...

స్పెయిన్‌లో త‌యారైన టాల్గో రైలు.. దేశంలోనే అత్యంత వేగ‌వంత‌మైన రైలుగా రికార్డు బద్దలు కొట్టింది. గంట‌కు 180 కిలోమీట‌ర్ల వేగాన్ని అందుకొని గ‌తిమాన్ ఎక్స్‌ప్రెస్ పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది. స్పెయి

భారత్‌లో అత్యంత ఫాస్టెస్ట్ రైలు ఏది... గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రికార్డు బద్దలు.. త్వరలో పట్టాలపైకి...
, శుక్రవారం, 15 జులై 2016 (11:01 IST)
స్పెయిన్‌లో త‌యారైన టాల్గో రైలు.. దేశంలోనే అత్యంత వేగ‌వంత‌మైన రైలుగా రికార్డు బద్దలు కొట్టింది. గంట‌కు 180 కిలోమీట‌ర్ల వేగాన్ని అందుకొని గ‌తిమాన్ ఎక్స్‌ప్రెస్ పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది. స్పెయిన్ సంస్థ టాల్గో నుంచి దిగుమతి చేసుకున్న తేలికపాటి ట్రైన్ మధుర - పాల్వాల్ మధ్య 86 కిలోమీటర్ల దూరాన్ని 39 నిమిషాల్లో చేరుకుంది. మార్గమధ్యంలో గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని ఈ రైలు అందుకుంది.

గతంలో ఢిల్లీ, ఆగ్రా న‌గ‌రాల‌ మ‌ధ్య న‌డుస్తోన్న‌ గ‌తిమాన్ 160 కిలోమీట‌ర్ల వేగంతో ఫాస్టెస్ట్ ట్రెయిన్‌గా పేరు గాంచింది. గతిమాన్ ఎక్స్ ప్రెస్ పేరిట ఉన్న 160 కేఎంపీహెచ్ రికార్డును టాల్గో రైలు బద్ధలుకొట్టింది. తక్కువ బరువుండే ఈ టాల్గో రైలును స్పెయిన్‌కు చెందిన కంపెనీ రూపొందించింది. 
 
ప్రస్తుతం ఇక్కడ ట్రయల్‌ రన్‌ జరుగుతోంది. స్పెయిన్‌ కంపెనీకి చెందిన ఇంజనీర్ల పర్యవేక్షణలో ట్రయల్‌ రన్‌ విజయవంతంగా పూర్తయ్యింది. 9 ఖాళీ కోచ్‌లతో ఈ రైలుకు ట్రయల్‌రన్‌ చేశారు. భూతేశ్వర్‌ నుంచి రూంధీ స్టేషన్ల మధ్య రైలు గంటకు 180 కి.మీ. వేగంతో ఎటువంటి ఆటంకం లేకుండా ప్రయాణించిందని అధికారులు తెలిపారు. 4,500 హెచ్‌పీ డీజిల్ ఇంజనుకు ఖాళీ కోచ్‌లను తగిలించి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. 
 
తదుపరి పాసింజర్ల సీట్లలో ఇసుక బస్తాలను ఉంచి మరో ట్రయల్ రన్‌ను ముంబై, న్యూఢిల్లీ మధ్య నిర్వహిస్తామని, గంటకు 220 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం తమ లక్ష్యమని ఆగ్రా డివిజన్ రైల్వే మేనేజర్ దిలీప్ కుమార్ సింగ్ తెలిపారు. తొలి రోజు 120 కిలోమీట‌ర్ల వేగంతో టాల్గో వెళ్లింద‌ని అధికారులు వెల్లడించారు. ప‌ది కిలోమీట‌ర్లకు పెంచి ప‌రీక్షించ‌గా ఒకేసారి 170 కిలోమీట‌ర్ల వేగాన్నిఅందుకుంది. తరువాతి ప్రయోగంలో ఏకంగా 180 కిలోమీట‌ర్ల వేగాన్ని పుంజుకుంది. దీంతో టాల్గో ప‌రీక్షలో ఫిట్ అని తేలింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా షీలా దీక్షిత్.. కాంగ్రెస్‌ ఖాతాలో మరో పరాభవమా?