బంగ్లాదేశ్‌లో ఒక హిందూ వ్యక్తి హత్యకు సంబంధించిన మరో ఘటనలో, ఫెని జిల్లాలోని దగన్‌భుయాన్ ఉపజిల్లాకు చెందిన షొమిర్ కుమార్ దాస్ జనవరి 11న హత్యకు గురయ్యారు. ఫెని పోలీసు సూపరింటెండెంట్ షఫీకుల్ ఇస్లాం ప్రకారం, బాధితుడు ఆదివారం రాత్రి తన ఆటోరిక్షాలో ఇంటి నుండి బయలుదేరాడు. కానీ తర్వాత కనిపించకుండా పోయాడు. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో అతని మృతదేహం లభ్యమైంది.
పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతోంది. అయితే, తాము ఇప్పటివరకు హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలను కనుగొనలేకపోయామని... పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు.
ఈ ఘటనను ప్రస్తావిస్తూ, భారతీయ జనతా పార్టీ నాయకుడు అమిత్ మాలవ్య మంగళవారం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో చేసిన ఒక పోస్ట్‌లో, హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులతో సహా ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో తాత్కాలిక ప్రభుత్వం విఫలమైందని, అలాగే బాధితులైన వర్గాలకు భరోసా ఇవ్వడంలో కూడా విఫలమైందని మాలవ్య ఆరోపించారు.