Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇండియా అక్రమాలకు నిలయం: భారత్‌ను ఏకిపారేసిన అమెరికా నివేదిక

ఇండియా అక్రమాలకు నిలయం: భారత్‌ను ఏకిపారేసిన అమెరికా నివేదిక
, శుక్రవారం, 26 జూన్ 2015 (12:55 IST)
భారత్‌ను అమెరికా నివేదిక ఏకిపారేసింది. ఇండియా అక్రమాలకు నిలయం అని అమెరికా నివేదిక వెలువరించింది. మానవ హక్కులను కాపాడటంలో సైన్యం, పోలీసు వ్యవస్థ విఫలమయ్యాయని, అత్యాచారాలు, లంచగొండితనం, ప్రజలపై హింస, ఎన్‌‍కౌంటర్‌లు వంటి వివిధ నేరాలతో భారత జైళ్లల్లో ఖైదీల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇండియాలో భద్రతా దళాలు, పోలీసులు హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతూ, అరాచకాలు చేస్తున్నారని, దేశానికి ఇదే పెను సమస్యగా మారిందని అమెరికా ప్రభుత్వం ఓ నివేదిక ద్వారా హెచ్చరించింది. 
 
జైళ్లలో పరిస్థితి దారుణంగా ఉందని, అన్యాయంగా అరస్టై నిర్భంధంలో ఉన్న వారి సంఖ్య కూడా పెరుగుతోందని.. విచారణ నిమిత్తం దీర్ఘకాలం పాటు జైళ్లలో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడిందని అమెరికా నివేదిక ఆరోపించింది. భారత్‌ను అత్యాచారాలు, పరువు హత్యలు, లైంగిక వేధింపులు, మహిళల పట్ల అగౌరవం, గృహ హింస, వరకట్న హత్యలు,తదితరాల సాంఘిక సమస్యలతో పెను తలనొప్పి తప్పదని అమెరికా నివేదిక పేర్కొంది. యువతుల అక్రమ ట్రాఫికింగ్, చిన్నారులతో వెట్టిచాకిరి, యువతులను బలవంతంగా వ్యభిచార కూపంలోకి లాగడం దేశాన్ని వెనక్కు నెట్టేస్తున్నాయని అభిప్రాయపడింది.

Share this Story:

Follow Webdunia telugu