టెక్నాలజీని సజావుగా వాడితే సత్ఫలితాలు ఇస్తుంది. నష్టాన్ని, అయోమయానికి గురిచేసే విధంగా ఉపయోగిస్తే అంతకంటే ఎన్నోరెట్లు నష్టాన్నే ఇస్తుంది. ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో AI టూల్ ఉపయోగించి ఫేక్ వీడియోలు సృష్టించడం ఎక్కువైంది. దీనితో అదే నిజమని నమ్మి ఆ వార్తను మరికొంతమందికి షేర్ చేయడం జరుగుతోంది. ఇప్పుడు అట్లాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
అదేమిటంటే.. పాకిస్తాన్ పార్లమెంట్ జరుగుతోంది. ఇంతలో సభ్యుల మధ్యలోకి ఓ గాడిద అతివేగంగా పరుగెత్తుకుంటూ వచ్చింది. కొంతమందిని కిందపడేసింది. బల్లలపైకి ఎక్కింది. ఇంకొందరిని నెడుతూ ఓ చోట ఆగిపోయింది. హఠాత్తుగా అలా గాడిద లోనికి రావడంతో కొంతమంది ఆగ్రహం చెందితే మరికొందరు గాడిదను చూసి నవ్వుకున్నారు. ఐతే ఈ వీడియో అంతా ఫేక్ అని తేలింది. కానీ అప్పటికే పలు పేరుమోసిన మీడియా సంస్థలు అదే నిజమని వార్తలను ప్రచురించడం జరిగిపోయింది. కొన్ని గంటల తర్వాత అది ఫేక్ వీడియో అని తెలిసి వార్తను డిలిట్ చేసి సారీ చెప్పాల్సి వచ్చింది. అదీ AI చేస్తున్న పనుల్లో ఒకటి.