Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రెజిల్‌లో జికా వైరస్: అబార్షన్లకు గిరాకీ పెరిగిపోతోంది.. గర్భందాల్చొద్దని ప్రభుత్వాల సలహా!

బ్రెజిల్‌, అమెరికాలను వణికిస్తున్న జికా వైరస్‌ ప్రపంచంలో మరిన్ని దేశాల్లో కలకలం రేపుతోంది. ఆ వైరస్‌ ప్రబలకుండా ఆయా దేశాల్లో చర్యలు తీసుకుంటున్నారు. జికా వైరస్ వల్ల అమెరికా, లాటిన్ వంటి దేశాల్లో ప్రస్త

బ్రెజిల్‌లో జికా వైరస్: అబార్షన్లకు గిరాకీ పెరిగిపోతోంది.. గర్భందాల్చొద్దని ప్రభుత్వాల సలహా!
, గురువారం, 23 జూన్ 2016 (14:38 IST)
బ్రెజిల్‌, అమెరికాలను వణికిస్తున్న జికా వైరస్‌ ప్రపంచంలో మరిన్ని దేశాల్లో కలకలం రేపుతోంది. ఆ వైరస్‌ ప్రబలకుండా ఆయా దేశాల్లో చర్యలు తీసుకుంటున్నారు. జికా వైరస్ వల్ల అమెరికా, లాటిన్ వంటి దేశాల్లో ప్రస్తుతం అబార్షన్లకు గిరాకీ బాగా పెరిగిపోయిందట. ఎందుకంటే ఆలుమగలు సెక్స్ చేస్తే దాని ద్వారా హెచ్ఐవీ (ఎయిడ్స్) మాత్రమే వ్యాపిస్తుందని తెలుసు.
 
కానీ జికావైరస్ బారిన పడితే ఇక తిరిగి కోలుకోవడమంటూ జరగదు. జికా వైరస్‌ పేరు చెబితేనే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. ఈ వైరస్‌ వల్ల వేల సంఖ్యలో పిల్లలు పుట్టుకతోనే అంగవైకల్యానికి గురవుతున్నారు. దీంతో సెక్స్‌లో పాల్గొన్న స్త్రీలు అబార్షన్ చేయించుకోవడానికి విపరీతంగా మొగ్గుచూపుతున్నారు. ప్రధానంగా బ్రెజిల్ వంటి దేశాలలో అబార్షన్లు చేయాలంటూ ముందుకొచ్చే మహిళల సంఖ్య ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. 
 
ఈ ఒక్క దేశం మాత్రమే కాదు ఇతర దేశాలలో కూడా అబార్షన్ల సంఖ్య బాగా పెరిగిందని నిపుణులు అంటున్నారు. ఈ వైరస్ కారణంగా పుట్టే పిల్లల మెదడు చాలా చిన్నగా ఉంటుందని, దాన్ని మైక్రోసెఫాలీ అంటారని, అందువల్ల ఇప్పట్లో గర్భం దాల్చొద్దని చాలా ప్రభుత్వాలు మహిళలకు సలహాలు ఇస్తున్నారు. దాంతో, ఆస్పత్రులలో అబార్షన్లతో పాటు అబార్షన్ అయ్యేందుకు ఉపయోగపడే మాత్రలను సరఫరా చేసే ఆన్లైన్ స్టోర్లకు కూడా విపరీతంగా డిమాండ్ పెరిగింది. 2015 నవంబర్ 17వ తేదీన అమెరికా ఆరోగ్య సంస్థ తొలిసారిగా జికా వైరస్ గురించిన హెచ్చరిక జారీచేసిన సంగతి విదితమే. ఇదిలావుంటే లాటిన్ అమెరికా దేశాలలో అబార్షన్లు చట్ట రీత్యా నేరం. దాంతో చాలామంది అనధికారికంగానే చేయించుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మా బిడ్డను కాపాడుకోలేం.. కారుణ్య మరణానికి అనుమతివ్వండి: కోర్టును ఆశ్రయించిన పేద జంట!