Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్ట్రేలియాలో దారుణం.. ఇంట్లో 8 మంది చిన్నారుల మృతదేహాలు లభ్యం!!

ఆస్ట్రేలియాలో దారుణం.. ఇంట్లో 8 మంది చిన్నారుల మృతదేహాలు లభ్యం!!
, శుక్రవారం, 19 డిశెంబరు 2014 (19:11 IST)
ఆస్ట్రేలియాలోని మరో దారుణం వెలుగులోకి వచ్చింది. సిడ్నీ కేఫ్‌లో ఒక ఉగ్రవాది చేసిన దారుణం, పాకిస్థాన్‌లో పెషావర్ స్కూల్లో తీవ్రవాదులు జరిపిన మారణహోమం నుంచి ప్రపంచ ప్రజలు ఇంకా తేరుకోక ముందే.. ఆస్ట్రేలియాలోని సౌత్ క్వీన్స్ ల్యాండ్లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. 
 
సౌత్ క్వీన్స్ల్యాండ్లోని కెయిర్న్స్ పట్టణంలోని ఓ ఇంటిలో మహిళ (34) తీవ్రంగా గాయపడినట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు.
 
ఆ ఇంటి ఆవరణలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా ఎనిమిది మంది చిన్నారులను మృతదేహలను గుర్తించారు. ఆ మృతదేహలన్నీ ఏడాదిన్నర వయస్సు గల చిన్నారుల నుంచి 15 సంవత్సరాల వయస్సు గల వారివి ఉన్నాయని చెప్పారు. పదునైన ఆయుధాలతో దాడి చేసినట్లు ఆ మృతదేహాలపై గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
 
మృతులంతా సోదరులుగా భావిస్తున్నామని చెప్పారు. గాయపడిన మహిళ ఆరోగ్యం పరిస్థతి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆ ఇంటిని అణువణువు తనిఖీ చేస్తున్నారు. 
 
అలాగే ఇంటి పరిసరాల్లోని వారిని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనతో ఆస్ట్రేలియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దేశం ప్రస్తుతం క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటుందని ప్రధాని టోని అబ్బాట్ తెలిపారు. ఈ దారుణంపై మాట్లాడేందుకు మాటలు రావడం లేదన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu