Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పడకపైనా ఫోన్ తప్పనిసరి... సెక్స్ చేస్తూనే స్మార్ట్ ఫోన్‌తో...

పడకపైనా ఫోన్ తప్పనిసరి... సెక్స్ చేస్తూనే స్మార్ట్ ఫోన్‌తో...
, శనివారం, 1 ఆగస్టు 2015 (15:36 IST)
ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అందుకు ముఖ్యకారణం సెల్‌ఫోన్‌ వాడకమే అని ఒక అధ్యయనం ద్వారా తేలింది. దీనిపై ప్రముఖ మొబైల్ ఫోన్ సంస్థ మోటరోలా తాజాగా సర్వే జరిపింది. అందులో ఆసక్తికరమైన పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్మార్ట్ ఫోన్ విడిచి ఉండలేని వాళ్లల్లో భారతీయులు ఎక్కువ మంది ఉన్నారట. ప్రపంచంలో 74 శాతం మంది స్మార్ట్ ఫోన్‌ని నిద్రించే పడకపైన ఉంచుకుంటున్నారట. చివరకు సెక్స్ జరుపుకునే టైంలోనూ స్మార్ట్ ఫోన్‌తో గడుపుతున్నారని సర్వేలో తేలింది.
 
ఆ సంస్థ ఏడు దేశాలకు చెందిన 7,000 మందిపై స్మార్ట్ ఫోన్ ఎలా ఉపయోగిస్తున్నారన్నదానిపై సర్వే జరిపింది. అందులో 60 శాతం మంది ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్‌ను చేతిలో పెట్టుకుని తిరుగుతున్నట్టు తెలిసింది. 74 శాతం మంది నిద్రించే సమయంలో కూడా స్మార్ట్ ఫోన్‌ను తమ వద్ద ఉంచుకుంటున్నట్టు తెలిపారు. వారు పాటర్న్‌తో సెక్స్ జరుపుతున్న సమయంలోనూ స్మార్ట్‌ఫోన్‌ను చెక్ చేసుకుంటుంటారట.
 
ఇంకా ఆరుగురిలో ఒకరు షవర్ స్నానానికి ముందు, 54 శాతం మంది తాము షేవింగ్ చేసుకునేందుకు ముందు ఫోన్‌ను చెక్ చేసుకుంటుంటారట. అదేవిధంగా స్మార్ట్ ఫోన్ గల వారిలో 39 శాతం మంది మాత్రమే తమ స్మార్ట్ ఫోన్‌తో సంతోషంగా ఉన్నారట. 79 శాతం మంది తమ స్మార్ట్ ఫోన్‌లను హ్యాండిల్ చేసే సమయంలో సమస్యలను ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. కాగా మోటరోలా జరిపిన ఈ అధ్యయనంలో భారత్‌తో పాటు యూఎస్, బ్రిటన్, బ్రెజిల్, చైనా, స్పెయిన్, మెక్సికో దేశాలు ఉన్నాయని పాల్గొన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu