Webdunia - Bharat's app for daily news and videos

Install App

58కి చేరిన కరాచీ మృతుల సంఖ్య: భద్రత కట్టుదిట్టం చేసిన పాక్

Webdunia
పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీలో ఐదురోజులుగా జరుగుతున్న హింసలో 58 మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. హింసను అదుపు చేయడానికి పాకిస్థాన్ ప్రభుత్వం భారీ స్థాయిలో అదనపు పారామిలటరీ బలగాలను రంగంలోకి దింపింది.

ఆఫ్ఘనిస్థాన్‌కు సరుకుల రవాణా చేయడానికి నాటో వినియోగించుకుంటున్న ఈ పోర్ట్ సిటీలో తెగల మధ్య జరుగుతున్న హింసను అదుపు చేయడానికి అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గత నెలలో ఈ నగరంలో 200 మంది పైగా చనిపోయారు. 1995 తర్వాత చోటుచేసుకున్న ఈ హింసకు కారణమైన వారి అరెస్ట్‌కు సహకరించిన వారికి పది మిలియన్ రూపాయల నగదు ఇస్తామని స్థానిక అధికారులు ప్రకటించారు.

కరాచీలో పరిస్థితిని చర్చించడానికి పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ మూడుసార్లు సమావేశాలు ఏర్పాటు చేశారు. నేరస్థులను కోర్టుకు ఈడ్చడంలో సహకరించాలని కరాచీలోని రాజకీయ పార్టీలకు జర్దారీ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. 17 మిలియన్ల జనాభా గల కరాచీ పాకిస్థాన్‌లో అతిపెద్ద నగరం. 1980,1990ల్లో కూడా ఈ నగరంలో తెగల మధ్య హింస జరిగింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments