Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జనావాసాలపై కుప్పకూలిన మరో యుద్ధ విమానం... 25 మంది దుర్మరణం..

జనావాసాలపై కుప్పకూలిన మరో యుద్ధ విమానం... 25 మంది దుర్మరణం..
, సోమవారం, 3 ఆగస్టు 2015 (16:25 IST)
జనావాసాలపై కూలిపోయే విమానాల సంఖ్య పెరిగింది. ఇటువంటి ప్రమాదాల వలన అటు విమానంలో ఉన్న వారే కాకుండా, ప్రజలు కూడా అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మరో విమానం జనావాసాలపై కుప్పకూలింది. సిరియా నైరుతీ ప్రాంతంలోని జెరికో నగరంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై దాడులు చేసేందుకు వెళ్లిన ఓ యుద్ధ విమానం అదుపుతప్పి ఇళ్లపై కుప్పకూలింది.
 
ఈ ప్రమాదంలో సుమారు 25 మంది వరకూ మరణించినట్టు తెలుస్తోంది. ఇళ్ల మీద విమానం కూలడంతో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని స్థానిక మీడియా తెలిపింది. అయితే విమానంలోని సిబ్బంది జాడ తెలియలేదని సిరియా సైనిక అధికారి ఒకరు వివరించారు. వీరు ఏమైనారన్న విషయం, విమానం ఎందుకు కూలిందన్న సమాచారంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu