Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

22 మిలియన్లకు చేరిన ఆస్ట్రేలియా జనాభా

Advertiesment
ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా జనాభా భారీ స్థాయిలో పెరిగిపోతుంది. తాజాగా ఆ దేశ జనాభా 22 మిలియన్ల మార్కు దాటింది. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా నగరాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా మెల్‌బోర్న్ నగరంలో వారానికి 1700 మంది పౌరులు పెరుగుతున్నారు. ఆస్ట్రేలియా గణాంకాల విభాగం ఈ వివరాలు వెల్లడించింది.

అంతర్జాతీయ విద్యార్థుల తాకిడి ఆస్ట్రేలియా జనాభా పెరిగిపోవడంలో కీలకపాత్ర పోషిస్తోంది. ఈ ఏడాది తొలి మూడు నెలలకాలంలో ఆస్ట్రేలియాకు వెళ్లిన అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 278,000కి చేరుకుంది. ఐదేళ్ల క్రితం ఈ సంఖ్య లక్ష మాత్రమే ఉండేది. ఇదిలా ఉంటే వార్షిక జనాభా వృద్ధి ఆస్ట్రేలియాలో ఇప్పుడు 439,000కి చేరుకుంది. ఐదేళ్ల క్రితం ఈ సంఖ్య ఇందులో సగం మాత్రమే ఉండేది.

Share this Story:

Follow Webdunia telugu