Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొలంబియాలో కూలిన మిలిటరీ హెలికాప్టర్: 17మంది దుర్మరణం

కొలంబియాలో మిలిటరీ హెలికాప్టర్‌ కూలి 17 మంది దుర్మరణం చెందారు. గత ఆదివారం అదృశ్యమైన ఎమ్‌ఐ-17 ఆర్మీ హెలికాప్టర్‌ మంగళవారం కొలంబియాలో కూలిపోయిందని అధికారులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న సహాయక బృందం ఘ

కొలంబియాలో కూలిన మిలిటరీ హెలికాప్టర్: 17మంది దుర్మరణం
, మంగళవారం, 28 జూన్ 2016 (14:43 IST)
కొలంబియాలో మిలిటరీ హెలికాప్టర్‌ కూలి 17 మంది దుర్మరణం చెందారు. గత ఆదివారం అదృశ్యమైన ఎమ్‌ఐ-17 ఆర్మీ హెలికాప్టర్‌ మంగళవారం కొలంబియాలో కూలిపోయిందని అధికారులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న సహాయక బృందం ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ఈ ప్రమాదంతో మరణించిన వారంతా మిలిటరీ అధికారులేనని తెలిపారు. 
 
ఈ దుర్ఘటన పట్ల ఆ దేశ అధ్యక్షుడు జువాన్‌ మాన్యుల్‌ సాంటోస్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్లే హెలికాప్టర్‌ కూలి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రంప్ నోటి దూల... అమెరికన్ల అభిమానం హిల్లరీ మీదే...