Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వారం రోజుల్లో తాలిబన్‌ సామ్రాజ్యం కూల్చివేస్తాం: పాక్

వారం రోజుల్లో తాలిబన్‌ సామ్రాజ్యం కూల్చివేస్తాం: పాక్
, ఆదివారం, 25 అక్టోబరు 2009 (13:30 IST)
పాకిస్థాన్ పాలకులకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్న తాలిబన్ తీవ్రవాదుల ఆగడాలను త్వరోలనే ఆటకట్టిస్తామని ఆ దేశ రక్షణశాఖామంత్రి చౌదరి అహ్మద్ ముఖ్తార్ స్పష్టం చేశారు. ముఖ్యంగా తాలిబన్ ప్రాబల్య ప్రాంతమైన దక్షిణ వర్జిస్థాన్‌లో తిష్టవేసిన తాలిబన్లను ఏరివేసేందుకు పాక్ ఆర్మీ భారీ స్థాయి ఆపరేషన్ చేపట్టిందన్నారు. ఈ ఏరివేత మరో వారం రోజుల్లో పూర్తి అవుతుందన్నారు.

ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో ఉన్న ముఖ్తార్ ఆ దేశ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో పది లేదా 12 రోజుల్లో దక్షిణ వర్జిస్థాన్‌లో ఉన్న తాలిబన్లను ఏరివేత కార్యక్రమం పూర్తవుతుందన్నారు. ఆరునూరైనా తమ దేశ సైనిక బలగాలు తీవ్రవాదులకు పూర్తిగా అడ్డుకట్ట వేస్తామన్నారు.

ఇదిలావుండగా, తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ చీఫ్ హకీముల్లా మెసూద్‌ సొంత పట్టణమైన కోట్కాయ్‌ను ప్రాంతాన్ని సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయన్నారు. ఇది తమ బలగాలు సాధించిన నైతిక విజయమన్నారు.

Share this Story:

Follow Webdunia telugu