Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వచ్చే యేడాది 22వ బిడ్డకు తండ్రికానున్న జాకొబ్ జుమా!

వచ్చే యేడాది 22వ బిడ్డకు తండ్రికానున్న జాకొబ్ జుమా!
దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకొబ్ జుమా సరికొత్త రికార్డును సృష్టించనున్నారు. 68వ యేట 22వ బిడ్డకు తండ్రికానున్నారు. తన మూడో భార్య వచ్చే సంవత్సరం ప్రారంభంలో ఈ బిడ్డకు జన్మనివ్వనుంది. దేశాధ్యక్షుడిగా కొనసాగుతున్న జాకొబ్ జుమాకు ప్రస్తుతం ముగ్గురు భార్యలు. అయితే, ఆయన బొంగ్వీ గ్లోరియా అనే మహిళతో ప్రేమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. వీరిద్దరు వివాహానికి ముందే శృంగార జీవితాన్ని ప్రారంభించడం వల్ల గ్లోరియా గర్భవతి అయింది.

ఈమెను వచ్చే డిసెంబరులో వివాహం చేసుకోనున్నారు. ఆ తర్వాత నెలలో అంటే వచ్చే యేడాది జనవరిలో ఈమె పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. దీనిపై దక్షిణాఫ్రికాకు చెందిన ఒక వార్తా పత్రిక కథనాన్ని ప్రచురించింది. గ్లోరియాను అధ్యక్షుడు వివాహం చేసుకుంటే దక్షిణాఫ్రికాలో నలుగురు భార్యలున్న ఏకైక వ్యక్తిగా జుమా మరో సరికొత్త రికార్డు సృష్టించనున్నారు.

ఇదిలావుండగా, జుమా రెండో భార్య 21వ సంతానానికి జన్మనిచ్చిన పదిహేను రోజుల తర్వాత గ్లోరియా గర్భందాల్చినట్టు వార్తలు వెలువడ్డాయి. అలాగే, జుమా రెండో భార్య తన బాడీగార్డ్‌తో నెరపిన వివాహేతర సంబంధం పుణ్యమే 21వ సంతానమని వార్తలు రాగా, వీటిని జుమా స్వయంగా ఖండించారు.

అలాగే, తన 20వ సంతానంపై కూడా వివాదం చెలరేగింది. తన స్నేహితుని కుమార్తెపై జుమా అత్యాచారం చేయడం వల్లే గర్భవతి అయినట్టు దక్షిణాఫ్రికా మీడియా కోడై కూసింది. దీనిపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాతికి క్షమాపణ కూడా చెప్పిన సంగతి తెల్సిందే. మొత్తం మీద జాకొబ్ జుమా ఇటు బహు భార్యత్వంలోనూ సంతానంలోనూ సరికొత్త రికార్డు నెలకొల్పనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu