లాటిన్ అమెరికాలో మరిన్ని ప్రాంతాలకు స్వైన్‌ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందింది. తాజాగా నికరగువా ప్రాంతంలో ఆరు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ ప్రమాదకర వైరస్ బారినపడిన పౌరుల సంఖ్య 26కు చేరింది. లాటిన్ అమెరికా ప్రాంతంలో అర్జెంటీనా దేశంలో 13 కొత్త కేసులు గుర్తించారు.
దీంతో లాటిన్ అమెరికాలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉరుగ్వే ఆరోగ్య శాఖ అధికారులు ఆ దేశంలో ఆదివారం ముగ్గురు ఏ(హెచ్1ఎన్1) వైరస్ బాధితులను గుర్తించారు. పెరూ అధికారులు కూడా 12 కొత్త స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయినట్లు వెల్లడించారు. కొత్త కేసులతో పెరూలో మొత్తం 61కి చేరుకుంది.