Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మే 6న బ్రిటన్‌ సాధారణ ఎన్నికలు: బ్రిటీష్ ప్రభుత్వం

మే 6న బ్రిటన్‌ సాధారణ ఎన్నికలు: బ్రిటీష్ ప్రభుత్వం
FILE
బ్రిటన్‌లో వచ్చే నెల మే ఆరో తేదీన సాధారణ ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు బ్రిటీష్ ప్రభుత్వం ప్రకటించింది. సాధారణ ఎన్నికల విషయమై బ్రిటన్ ప్రధాని గార్డన్ బ్రౌన్.. రాణి ఎలిజిబెత్‌తో చర్చలు జరిపినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఈ చర్చలకు అనంతరం గార్డన్ బ్రౌన్ మాట్లాడుతూ.. వచ్చే నెల మే ఆరో తేదీన సాధారణ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. ఈ ఎన్నికలకు ప్రజలు పూర్తి సహకారం అందిచాల్సిందిగా గార్డన్ బ్రౌన్ పిలుపునిచ్చారు.

ఇకపోతే.. బ్రిటన్ సాధారణ ఎన్నికల్లో బ్రిటన్ ప్రధాని గార్డెన్ బ్రౌన్ లేబర్ పార్టీ తరపున పోటీ చేస్తుండగా, కన్సర్వేటివ్ పార్టీ ప్రతిపక్షంగా పోటీ పడుతోంది. గార్డన్ బ్రౌన్ పార్టీకి ప్రతిపక్షమైన కన్సర్వేటివ్ పార్టీల మధ్య ఎన్నికల పోరు రసవత్తరంగా ఉంటుందని ఆ దేశ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఈ ఎన్నికల్లో విజయలక్ష్యంగా ప్రచారానికి దిగిన గార్డెన్ బ్రౌన్ పార్టీ నాలుగో సారి కూడా ప్రభుత్వాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. దీనికోసం గార్డన్ బ్రౌన్ మాత్రమే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను కేంద్ర స్థాయిలో పటిష్టం చేయగలరని ఆ పార్టీ ప్రచారం చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu