Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమికి 750 కాంతి సంవత్సరాల దూరంలో గ్రహం!

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2011 (11:21 IST)
సౌర కుటుంబానికి దూరంగా నక్షత్రమండలంలో అత్యంత నల్లని రంగుతో ఉన్న ఒక గ్రహాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. బృహస్పతి పరిమాణంలో ఉన్న ఈ గ్రహానికి టీఆర్‌ఈఎస్‌-2బిగా వారు పేరు పెట్టారు. ఈ గ్రహం నుంచి ఒక శాతం కంటే తక్కువ కాంతి వెలువడ వెలువడుతున్నట్టు కనుగొన్నారు. అందుకే ఇది నల్లగా బొగ్గు వలే కనిపిస్తోందని రాయల్‌ అస్ట్రోనామికల్‌ సొసైటీ పేర్కొంది.

ట్రాన్స్‌ అట్లాంటిక్‌ ఎక్సో ప్లానెట్‌ సర్వేలో భాగంగా నాసా అంతరిక్షనౌక కెప్లెర్‌ 2006లో ఈ టీఆర్‌ఈఎస్‌-2బి గ్రహాన్ని గుర్తించింది. ఈ నౌక పంపించిన చిత్రాలను హార్వర్డ్‌ స్మిత్స్‌సోనియన్‌ సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రో ఫిజిక్స్‌కు చెందిన డేవిడ్‌ కిప్పింగ్‌ బృందం విశ్లేషించింది. అయితే, ఈ గ్రహం భూమికి 750 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని, జీఎస్‌సీ 03549- 02811 అనే నక్షత్రం చుట్టూ 5 మిలియన్‌ కిలోమీటర్ల దూరం నుంచి పరిభ్రమిస్తున్నట్టు వారు వెల్లడించారు.

గ్రహంపై నెలకొన్న అసాధారణ వాతావరణం కారణంగా ప్రకాశాన్ని శోషణం చేసుకొనే రసాయన మూలకాల అవిరులు పొటాషియం, వాయురూపంలోని టైటానియం ఆక్సైడ్‌లు భారీస్థాయిలో ఉన్నట్లు శాస్తవ్రేత్తల విశ్లేషణలో కనుగొన్నారు. అయితే ఈ గ్రహం నల్లగా కన్పించటానికి గల కారణాలపై శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments