Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్, చైనా వివాదాన్ని పక్కనబెట్టిన నేపాల్ నూతన ప్రధాని

భారత్, చైనా వివాదాన్ని పక్కనబెట్టిన నేపాల్ నూతన ప్రధాని
, బుధవారం, 7 సెప్టెంబరు 2011 (16:44 IST)
నేపాల్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పొరుగున ఉన్న దిగ్గజ దేశాలు భారత్, చైనాలలో చేపట్టే తొలి విదేశీ పర్యటనపై చోటుచేసుకొనే వివాదాన్ని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ నుంచి విద్యనభ్యసించిన నేపాల్ నూతన ప్రధానమంత్రి బాబూరామ్ భట్టారాయ్ పక్కనబెట్టనున్నారు.

గత నెలలో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన 57 ఏళ్ల భట్టారాయ్ ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశాలకు హాజరయ్యేందుకు గానూ తన తొలి విదేశీ పర్యటనకు న్యూయార్క్‌కు వెళ్లనున్నారు. భట్టారాయ్ సారధ్యంలోని నేపాల్ బృందం సెప్టెంబర్ 17 లేదా 19న ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యాలయాన్ని సందర్శిస్తుంది.

భారత్, చైనా వివాదాన్ని తప్పించుకొనేందుకు నేపాల్ ప్రధానులు ఇతర దేశాల్లో జరిగే సమావేశాలకు వెళ్లడం ఇది వరుసగా మూడోసారి. కమ్యూనిస్ట్ పార్టీకే చెందిన భట్టారాయ్‌కు ముందు ప్రధాని మాధవ్ కుమార్ నేపాల్ 2010లో కైరోలో జరిగిన 15వ అలీనోద్యమ సదస్సును ఎంచుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu