Refresh

This website m-telugu.webdunia.com/article/international-news/%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E2%80%8C%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%B2%E0%B0%82%E0%B0%95-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%9C%E0%B1%80-%E0%B0%B9%E0%B1%88%E0%B0%95%E0%B0%AE%E0%B1%80%E0%B0%B7%E0%B0%A8%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AE%E0%B1%83%E0%B0%A4%E0%B0%BF-111080900026_1.htm is currently offline. Cloudflare's Always Online™ shows a snapshot of this web page from the Internet Archive's Wayback Machine. To check for the live version, click Refresh.

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌లో శ్రీలంక మాజీ హైకమీషనర్ మృతి

Advertiesment
శ్రీలంక
భారత్‌లో శ్రీలంక మాజీ హైకమీషనర్ రొమేష్ జయసింఘే మృతి చెందినట్లు శ్రీలంక విదేశీ వ్యవహారాల శాఖ సోమవారం వెల్లడించింది. అధ్యక్షుడు మహీంద్ర రాజపక్సేకు సలహాదారుగా వ్యవహరించిన 56 ఏళ్ల జయసింఘే క్యాన్సర్‌తో మరణించారు.

జయసింఘే ఈ ఏడాది మార్చి వరకు శ్రీలంక విదేశాంగ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు. 2006 నుంచి 2009 వరకూ న్యూఢిల్లీలో శ్రీలంక హైకమీషనర్‌గా ఉన్న ఆయన భారత్, శ్రీలంక మధ్య దౌత్య సంబంధాల బలోపేతానికి విశేషమైన కృషి చేశారు. జయసింఘే మృతి పట్ల శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేతో పాటు భారత విదేశాంగ శాఖ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu