Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫుకుషిమా అణు ప్లాంట్‌ను సందర్శించనున్న బాన్‌కీ మూన్

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2011 (09:30 IST)
జపాన్‌లోని భూకంపం, సునామీ బాధిత ప్రాంతాల్లో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ వచ్చే శనివారం నుంచి పర్యటించనున్నారు. గత మార్చి 11వ తేదీన జపాన్‌ను భారీ భూకంపం కుదిపేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత సునామీ సంభవించడంతో వేలాది మంది ప్రజలు చనిపోగా.. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

ఈ భూకంపం కారణంగా ఫుకుషిమా డైచీ అణు విద్యుత్ కర్మాగారం కూడా దెబ్బతింది. దీంతో ప్లాంట్‌లోని రియాక్టర్ నుంచి అణుథార్మకత విడుదలైంది. ఈ నిషేధిత ప్రాంతాన్ని బాన్ కీ మూన్ సందర్శించనున్నారు. దీనికి టోక్యో ఎలక్ట్రికల్ పవర్ కార్పొరేషన్ వ్యతిరేకత తెలిపినప్పటికీ ఆయన ససేమీరా అంటున్నారు. ఖచ్చితంగా ఆ విద్యుత్ కర్మాగారాన్ని సందర్శించాలనే పట్టుదలతో ఉన్నారు. కాగా, మూన్ జపాన్ పర్యటన వచ్చే శనివారం నుంచి ప్రారంభంకానుంది.

అక్కడ నుంచి ఫుకుషిమా నగరంలోని ఒక ఉన్నత పాఠశాల విద్యార్థులతో మాట్లాడతారని ఆయన ప్రతినిధి వెల్లడించారు. అనంతరం జపాన్ రాజదాని టోక్యోలో ఆ దేశ ప్రధాని నావుటో కాన్‌, విదేశాంగ మంత్రి టకేకీ మట్సుమోటోతో సమావేశమవుతారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments